క్రికెట్ వ్యాఖ్యాతగా కెరీర్ సవాళ్లపై మందిర భేడి
వ్యాఖ్యతగా ప్రయాణం అంత సులువు కాదని కరీనా కపూర్ ఖాన్‌తో చాటింగ్ సెషన్‌లో మందిరాభేడి. క్రికెట్ లెజెండ్స్ నుండి సె*జాన్ని ఎదుర్కొన్నానని కూడా తెలిపారు.
90లలో నటి మందిరా భేడి నటనారంగ ప్రవేశం చేసారు. ఆ తర్వాత దశాబ్ధ కాలంలో టీవీ నటిగా, వ్యాఖ్యాతగా మారారు. 2003లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా హోస్ట్ గా సంచలనం సృష్టించారు. లెజెండరీ క్రికెటర్లను టెలివిజన్ లైవ్ లో ప్రశ్నలు అడుగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ తనను ఆరాధించారు. అయితే క్రికెటర్లతో హోస్టింగ్, చర్చా ఘోష్టి నిర్వహించడం అంటే ఆషామాషీ కాదు. అది కూడా దిగ్గజ క్రికెటర్ల ముందు ఎలాంటి సంకోచం బిడియం లేకుండా మాట్లాడాలి. పైగా సబ్జెక్ట్ నాలెజ్ చాలా కావాలి. కానీ క్రికెట్ వ్యాఖ్యాతగా, హోస్ట్ గా ఆరంభ వారం ప్రతిరోజూ తాను తడబడేదానినని మందిర అన్నారు. సంచోచించేదానిని..తప్పు ప్రశ్నలు అడిగేదానిని. దాంతో నాకు సరైన సమాధానాలు లభించేవి కావు. కొన్నిసందర్భాల్లో ఏడ్చేసేదానిని అని కూడా మందిర తెలిపారు. ముఖ్యంగా 2003 ప్రపంచ కప్ సమయంలో తానను క్రికెటర్లు అగౌరవంగా చూశారని చెప్పారు.
వ్యాఖ్యతగా ప్రయాణం అంత సులువు కాదని కరీనా కపూర్ ఖాన్‌తో చాటింగ్ సెషన్‌లో మందిరాభేడి. క్రికెట్ లెజెండ్స్ నుండి సె*జాన్ని ఎదుర్కొన్నానని కూడా తెలిపారు. క్రికెట్ లేదా క్రీడారంగంలో ప్రతిచోటా స్త్రీలకు మంచి అవకాశాలున్నాయి. కానీ ఏదైనా కొత్త వృత్తిలో మొదటిసారి స్త్రీలను చూసినప్పుడు భూతద్దం పెట్టి చూస్తారు. అందరూ మనల్ని పరిశీలిస్తారు. కామెంట్లు చేస్తారు. క్రికెట్‌లో ఈమె ఎందుకు అని నా గురించి అడిగేవారు.. అని మందిర తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నిజానికి అప్పట్లో కొత్త ప్రేక్షకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఒక మహిళా వ్యాఖ్యాతగా నన్ను చానెల్ ప్రవేశపెట్టింది. ఒక మహిళ ఆరోజుల్లో వ్యాఖ్యతగా ప్రారంభం కావడం అంత సులువు కాదు. త్వరగా అంగీకరించరు. దిగ్గజాలను ప్రశ్నించాలి. కాబట్టి ప్రజలు నన్ను ప్రశ్నిస్తారు. కెమెరా ముందు క్రికెట్ భాష మాట్లాడాలి. ఇదంతా క్లిష్ఠతరమైన ప్రక్రియ అని తెలిపారు మందిర. క్రికెట్ ప్రెజెంటర్‌గా మొదటి వారం కఠినంగా సాగింది. తప్పులు జరిగేవి. చాలామంది క్రికెట్ దిగ్గజాలు నా ప్రశ్నలను పట్టించుకోలేదు. సంబంధం లేని సమాధానాలతో అగౌరవపరిచారు. అసహనంగా భావించారని కూడా ఆమె అన్నారు.
క్రికెట్ వ్యాఖ్యాతగా మొదటివారం సంకోచం..తడబాటు.. తప్పులతో గడిచిపోయింది. ప్రతి షో ముగిశాక తల దించుకుని ఏడ్చేదాన్ని అని కూడా మందిర గుర్తు చేసుకున్నారు. నేను ప్రశ్నించేప్పుడు నన్ను లెజెండ్స్ కన్నార్పకుండా చూసేవారు. నా ప్రశ్నలకు కొన్నిసార్లు కనెక్టయ్యేవారు కాదు.. నా ప్రశ్న వారికి సంబంధించినది కాకపోవడంతో స్పందన ఉండేది కాదు. ఇది చాలా ఇబ్బందికరం.. అగౌరవంగా భావించేదానిని అని మందిరా వెల్లడించారు. కానీ కాలక్రమంలో షో ప్రతినిధుల అండదండలతో ప్రతిదీ మారిపోయింది. టీవీ చానెల్ ప్రతినిధులు నాకు అండగా నిలిచారు. దాంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. చివరికి నేను అన్నిటికీ సమాధానాలు రాబట్టాను. వ్యాఖ్యాతగా ప్రజలు నన్ను అంగీకరించి గౌరవించారు.. అని తెలిపారు.
2003 ప్రపంచకప్ సమయంలో కరీనా కపూర్ ఖాన్ మామగారైన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని మందిరా బేడీ వెల్లడించారు. 2003 ప్రపంచకప్ లో మన్సూర్ సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడారు. ఆయన చాలా గౌరవప్రదంగా, స్వీట్ గా మాట్లాడేవారు. అతడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అందరూ మాట్లాడుకునే మందిరా బేడీవి నువ్వు అని ప్రశంసించారు. అది నాకు చాలా మంచి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని మందిర గుర్తు చేసుకున్నారు. మందిర వెండితెర, బుల్లితెర నటిగా సుదీర్ఘ అనుభవం ఘడించారు. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే రోజుల నుంచి నటిగా కెరీర్ ని సాగించారు. ప్రభాస్ నటించిన `సాహో` చిత్రంలో మందిర ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలోను మందిర నటిస్తున్నారు.