బిగ్ బాస్ 8 : మణికంఠ ఎలిమినేషన్ ట్విస్ట్ తెలిసిపోయిందిగా..?

లాస్ట్ వీక్ నామినేషన్స్ లో 9 మంది హౌస్ మెట్స్ ఉండగా చివరి వరకు మణికంఠ, గౌతం లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు.

Update: 2024-10-21 03:57 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆదివారం ఎపిసోడ్ ట్విస్ట్ లు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో 9 మంది హౌస్ మెట్స్ ఉండగా చివరి వరకు మణికంఠ, గౌతం లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. ఐతే మణికంఠ హౌస్ లో తానిక ఉండలేను ఓపిక అయిపోయింది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. కెమెరాకు కూడా బిగ్ బాస్ ప్లీజ్ నన్ను పంపించేయండి ఇక నా వల్ల కాదు. ఆడియన్స్ తనకు ఓట్స్ వేయకండి అని అన్నాడు. ఎలిమినేషన్ టైం లో మణికంఠ, గౌతం లను యాక్టివిటీ ఏరియాకు తీసుకొచ్చిన నాగార్జున మణికంఠ వీడియోన్ హౌస్ మెట్స్ కి చూపించి వారి నిర్ణయాన్ని అడిగాడు.

ఐతే ఒకరిద్దరు తప్ప మణికంఠను పంపించమనే అందరు చెప్పారు. చివరికి నాగార్జున మణికంఠకు 5 లెక్క పెడతా ఆ తర్వాత నీ నిర్ణయం చెప్పమని అడిగాడు. ఐతే ఆ ఐదు లెక్క పెట్టాక కూడా మణికంఠ వెళ్లిపోతా అని చెప్పడంతో అతన్ని సెల్ఫ్ ఎవిక్షన్ కింద పరిగణించబడ్డాడు. ఐతే ఎలాగు మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ ఏంటో చూద్దామని ఆ రోప్ లాగమని చెప్పాడు నాగార్జున.

రోప్ లాగితే గౌతం కి రెడ్ బకెట్ వచ్చింది. ఆడియన్స్ మణికంఠకు ఓటింగ్ వేశారు. అయినా సరే మణికంఠ సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకున్నాడు కాబట్టి హౌస్ నుంచి బయటకు వచ్చాడు. స్టేజ్ మీద నాగార్జున తో హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా రిలీఫ్ గా ఉందని అన్నాడు. ఐతే హౌస్ మెట్స్ కి టాటా బై బై చెబుతూ తన దృష్టిలో షిప్ మీద ఉండేది ఎవరు.. మునిగిపోయేది ఎవరు అన్నది చెప్పమన్నాడు. తేజ, నిఖిల్, ప్రేరణ, పృధ్వి, గౌతం ల ఫోటోలు నీళ్లలో వేసిన మణికంఠ హరితేజ, నబీల్, మెహబూబ్, నయని పావని, విష్ణు ప్రియల ఫోటోలు షిప్ మీద ఉంచాడు. అవినాష్, రోహిణిలకు కూడా షిప్ మీద ఉండే అర్హత ఉందని అన్నాడు. యష్మి గురించి ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదు మణికంఠ.

ఐతే మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యాడు. మాములుగా అయితే ఎవరైనా ఎలిమినేట్ అయితే నాగార్జున వారి జర్నీని చూపిస్తాడు. కానీ మణికంఠది చూపించలేదు. సో చూస్తుంటే మణికంఠ మళ్లీ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. దాని కోసమే మణికంఠ జర్నీని చూపించలేదు. ఐతే హౌస్ నుంచి బయటకు రాగానే హమ్మయ్య అనుకున్న మణికంఠ మళ్లీ హౌస్ లోకి వెళ్తాడా అన్నది డౌట్. ఏది ఏమైనా మణికంఠ ఎలిమినేషన్ చాలా ట్విస్టులు టర్న్ లతో జరిగిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News