డిజైనర్‌తో స్టార్ హీరోయిన్స్ 30 ఏళ్ల స్నేహానుబంధం
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల తన స్వగృహంలో దీపావళి వేడుకను నిర్వహించాడు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల తన స్వగృహంలో దీపావళి వేడుకను నిర్వహించాడు. ఈ వేడుకల కోసం అతడు బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులను ఆహ్వానించాడు. అంతేకాదు తన పార్టీ నుండి కొన్ని సెల్ఫీలను కూడా మనీష్ జీ షేర్ చేసారు. ఈ సెల్ఫీల్లో 90లలోని అత్యంత విజయవంతమైన నటీమణులు కాజోల్, కరిష్మా కపూర్, రవీనా టాండన్ , ఊర్మిలా మటోండ్కర్ లతో పోజులిచ్చాడు. వారి చిరకాల స్నేహం గురించి అతడు తన ఇన్ స్టాలో నోట్ రాసాడు.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనీష్ మల్హోత్రా తన దీపావళి పార్టీ నుండి వరుస ఫోటోలను షేర్ చేసాడు. నోట్ లో ఇలా రాసాడు. తాను దాదాపు 30 ఏళ్లుగా వారితో స్నేహంగా ఉన్నానని, వారి హిట్ పాటలు , సినిమాల కోసం వారికి స్టైలింగ్ చేసానని తెలిపాడు. ఫోటోలను షేర్ చేస్తూ .. 90ల నాటి సూపర్‌స్టార్ హీరోయిన్లందరూ అద్భుతంగా కనిపిస్తున్నారు… నేను వారి కోసం చాలా సినిమాలకు పని చేసారు. సూపర్హిట్లు అయిన ఐకానిక్ పాటలకు దుస్తులు డిజైన్ చేసాను. స్టైలింగ్ చేసాను .. మేం షూటింగ్ కోసం కలిసి ప్రపంచాన్ని పర్యటించాము… ఇది 30 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ మేము ఆ బంధాన్ని, ఆప్యాయతని, స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంటాము.. స్నేహాలు నిలవవని చెప్పే పరిశ్రమలో స్నేహాలు చిరస్థాయిగా నిలుస్తాయని నిరూపణ అయింది. మేం కలిసి పని చేస్తూనే ఉంటాం..అని ఎమోషనల్ నోట్ రాసారు.
అతడు షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో మొదటి ఫోటోలో కాజోల్ రెడ్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. రెండవ, మూడవ ఫోటోలో బ్లాక్ కలర్ డ్రెస్ లో కరిష్మాతో సెల్ఫీ ఆకట్టుకుంది. మూడవ ఫోటోలో రవీనా, ఊర్మిళతో సెల్ఫీ ఉంది. రవీనా బంగారు రంగు దుస్తులలో ఆకర్షణీయంగా కనిపించగా, ఊర్మిళ బ్లూ సూట్లో హృదయాలను దోచుకుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... కాజోల్ ఇటీవల దో పట్టిలో కనిపించింది. కృతి సనన్‌తో కలిసి స్క్రీన్ పై మెరిసింది. మరోవైపు రవీనా చివరిసారిగా సంజయ్ దత్తో కలిసి ఘుడచాడిలో కనిపించింది. కరిష్మా ప్రస్తుతం భారతదేశపు బెస్ట్ డ్యాన్సర్ 4లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఊర్మిళ 2018లో బ్లాక్మెయిల్లో ఒక పాటలో చివరిగా కనిపించింది.