సీనియర్ నటి తల్లి కాలేకపోవడానికి కారణం?
ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `హీరామండి`లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది మనీషా.
మణిరత్నం తెరకెక్కించిన `బొంబాయి` సినిమాలో నటించింది మనీషా కొయిరాలా. అందగాడు అరవింద స్వామితో రొమాన్స్ లో అదరగొట్టింది. కింగ్ నాగార్జున సరసన `కిల్లర్` చిత్రంలోను రొమాంటిక్ నటనతో ఆకట్టుకుంది. యాక్షన్ కింగ్ అర్జున్ తో `ఒకే ఒక్కడు`లో పల్లెటూరి పిల్లగా నటించి మనసులు దోచింది. ముఖ్యమంత్రి ఆరాధించి ప్రేమించే యువతిగా ఆ చిత్రంలో కనిపించింది.
ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `హీరామండి`లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది మనీషా. హీరామండిలో మల్లికాజాన్ పాత్రలో నటించి హృదయాలను గెలుచుకుంది. తాజా ప్రచార ఇంటర్వ్యూలో మనీషా కొన్ని వ్యక్తిగత విషయాలను ప్రస్థావించింది. 2012లో క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు తాను చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొన్నానని కూడా గుర్తు చేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో మనీషా కొయిరాలా మాట్లాడుతూ కష్టంలో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులు మాత్రమే తన పక్కన ఉన్నారని గుర్తుచేసుకుంది. తన తల్లి, సోదరుడు, సోదరుని భార్య మాత్రమే తనకు అండగా ఉన్నారని తెలిపింది.
పరిశ్రమలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నా కానీ ఎవరూ తనను పలకరించలేదని, తనతో ఆ కష్ట కాలంలో ఎవరూ లేరని మనీషా గుర్తు చేసుకుంది. ``ఇది ఒక ప్రయాణం. ఇది ఒక అభ్యాస అనుభవం కూడా. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారని నిజంగా నమ్మాను. కలిసి పార్టీలు, కలిసి ప్రయాణించడం, కలిసి సరదాగా గడపడం వరకే వాళ్లంతా. స్నేహితులు నా కష్టంలో నాతో ఉంటారని అనుకున్నాను. కానీ ఎవరూ లేరు!`` అని గుర్తు చేసుకుంది మనీషా.
నాకు కూడా భారీ కోయిరాలా ఖాన్‌దాన్ (పెద్ద కుటుంబం) ఉంది. కానీ కష్టంలో వాళ్లలో ఎవరూ నాతో లేరు. నాకు పెద్ద కుటుంబం ఉంది.. అందరూ సంపన్నులు.. వారందరూ భరించగలిగేంత స్థోమత ఉన్నవారే.. కానీ ఎవరూ నాతో లేరు! అని తెలిపింది. కానీ నా తల్లిదండ్రులు.. నా సోదరుడు.. నా సోదరుడి భార్య మాత్రమే నాతో ఉన్నారు.
నా తక్షణ కుటుంబమే నా ప్రాధాన్యత. వారు నా జీవితంలో మొదటి స్థానంలో ఉన్నారు..ఆ తరువాతే అందరూ అని మనీషా అంది.
మాతృత్వం వదులుకోవడానికి కారణం?
మాతృత్వాన్ని స్వీకరించడంపై తన ప్రణాళికల గురించి మనీషా మాట్లాడింది. తనకు అండాశయ క్యాన్సర్ రావడం తో తల్లిని కావడం చాలా కష్టం. కానీ నేను దానికి చింతించలేదు.. శాంతంగానే ఉన్నాను. గతంలో పోయింది వదిలేసి, నాకు ఉన్నదానితో సంతృప్తిగా నా వంతు కృషి చేయనివ్వండి. పిల్లలను దత్తత తీసుకోవడం గురించి చాలా ఆలోచించాను. నేను చాలా త్వరగా ఒత్తిడికి గురవుతానని గ్రహించాను. నేను చాలా త్వరగా ఆందోళన చెందుతాను. కాబట్టి చాలా చర్చల తర్వాత నేను శాంతించాను. నేను గాడ్ మదర్‌గా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేను కలిగి ఉన్నదానితోనే నేను ఏదైనా చేయాలి. నా దగ్గర ఉన్నది నేను ప్రేమించే వృద్ధాప్య తల్లిదండ్రులు. నేను వారి కంటికి ఆపిల్.. నేను వారి విశ్వానికి కేంద్రంగా ఉన్నాను. నేను వారిని ఆదరిస్తాను. నిజానికి నేను ఇప్పుడు తరచుగా ఖాట్మండు (నేపాల్, స్వస్థలం)కి వెళుతున్నాను. వారితో విలువైన సమయం గడుపుతాను. నేను ఇలా ఉండటాన్ని ప్రేమిస్తున్నాను.. అని మనీషా కొయిరాలా తెలిపారు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 8-ఎపిసోడ్ ల సిరీస్ హీరామండి మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇందులో అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సోనాక్షి సిన్హా కూడా నటించారు. మనీషా కొయిలారా పాత్రకు మంచి స్పందన దక్కింది.