కొత్త ఇన్నింగ్స్ కోసమేనా సీనియర్ నటి పాట్లు?
అల్లరి నరేష్ సరసన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం, శుభప్రదం చిత్రాల్లో నటించింది మంజరి ఫడ్నిస్. కానీ ఈ భామకు ఆశించినంత పెద్ద కెరీర్ సౌత్‌లో దక్కలేదనే చెప్పాలి
అల్లరి నరేష్ సరసన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం, శుభప్రదం చిత్రాల్లో నటించింది మంజరి ఫడ్నిస్. కానీ ఈ భామకు ఆశించినంత పెద్ద కెరీర్ సౌత్‌లో దక్కలేదనే చెప్పాలి. అందం, ప్రతిభ ఉన్నా కానీ పోటీలో నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత మంజరి బాలీవుడ్ లోను నటించింది. తమిళం, మలయాళం, మరాఠా భాషల్లోను ఒక్కో సినిమా చేసింది. కానీ ఏ పరిశ్రమలోను నిలదొక్కుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే మంజరి ఫడ్నిస్ కి తన కెరీర్ లో 2024 కీలక సంవత్సరంగా మారింది. ఈ ఏడాది వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయింది. పూణే హైవే, పెంట్‌హౌస్ వంటి చిత్రాలలోను ఈ బ్యూటీ నటించింది. ఇటీవలే ఒక కొత్త కారును కూడా కొనుగోలు చేసానని తెలిపింది. 2025లో తన నటన, గానంలోను కెరీర్‌లను సమతుల్యం చేసుకోవడానికి ఎదురుచూస్తోంది.
చాలా ఆత్మపరిశీలన తర్వాత నన్ను నేను మళ్లీ ఆవిష్కరించుకున్న సంవత్సరం ఇది అని మంజరి తెలిపింది. నా సిస్టమ్‌ను రీవైరింగ్ చేయడం వల్ల చాలా అద్భుతమైన విషయాలు జరిగాయి... గత 2 సంవత్సరాలుగా ఎన్నో ఉత్సవాల్లో విపరీతమైన ప్రేమను పొందుతున్న నా చిత్రం `చల్తీ రహే జిందగీ` ఈ సంవత్సరం ఎట్టకేలకు విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల ప్రేమను పొందింది. అలాగే నేను నా ఒకటవ సింగిల్ విడుదల చేయడంతో సంగీత పరిశ్రమలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నేను చిన్నప్పటి నుంచి ఆరాధించే మీనాక్షి శేషాద్రి మేడమ్‌తో కలిసి పని చేస్తున్నాను. 2024లో ఫెమినా మహారాష్ట్ర అచీవర్ పురస్కారాన్ని గెలుచుకోవడం ఆనందాన్నిచ్చింది. నా సినిమా `పూణే హైవేని 2` కొన్ని వారాల క్రితం IFFI గోవాలో ప్రదర్శించాం. ఇంకా సంవత్సరం చివరి వరకు ఎదురుచూడాలి. . అని తెలిపింది.
మంజరి ఫడ్నిస్ 2.0 గా మారాను. నేను నటించినవి ఇంకా రావాల్సి ఉంది. నా సినిమాలు కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి - పూణే హైవే, పెంట్‌హౌస్, జిందగీ నమ్‌కీన్ రిలీజ్ కి వస్తున్నాయి.. అలాగే నటిగా నాలోని కొత్త కోణాన్ని చూపిస్తాను అని తెలిపింది. మంజరి సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో టూ హా*గా కనిపిస్తోంది. ఎరుపు రంగు టాప్, కాంబినేషన్ రెడ్ కలర్ బాటమ్ తో మంజరి హాట్ గా కనిపించింది.