20 కోట్ల బడ్జెట్.. 240 కోట్ల వసూళ్లు.. ఇది అసలైన బ్లాక్ బస్టర్ అంటే..!

ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ లిస్ట్ భారీగానే ఉంది. ఐతే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా అంటే 1000 కోట్లు కలెక్షన్స్ దాటిన సినిమా అని అందరు అనుకుంటారు

Update: 2024-12-19 02:30 GMT

ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ లిస్ట్ భారీగానే ఉంది. ఐతే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా అంటే 1000 కోట్లు కలెక్షన్స్ దాటిన సినిమా అని అందరు అనుకుంటారు. కానీ ఆ కలెక్షన్స్ రాబట్టడానికి తగిన బడ్జెట్ ని కూడా కేటాయిస్తారు. ఈ ఇయర్ పాన్ ఇండియా హిట్లైన కల్కి 2808 AD, పుష్ప 2 సినిమాలు 1000 కోట్లు దాటి వసూళ్ల పరంగా అదరగొట్టాయి. ఐతే ఈ సినిమాలు సూపర్ హిట్ సినిమాల కింద లెక్క కట్టినా ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నంబర్ 1 స్థానం అంటే మాత్రం అది మళయాల సినిమా మంజుమ్మల్ బోయ్స్ దక్కించుకుంది.

మళయాలంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అవ్వడంతో మిగతా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా ఘన విజయాన్ని అందుకుంది. మంజుమ్మల్ బోయ్స్ సినిమాను మేకర్స్ కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బసి, బాలు వర్గెస్, గణపతి పోదువల్, లాల్ జూనియర్, దీపిక పరంబోల్ ప్రధాన పాత్రలుగా నటించారు. గుణ కేవ్స్ లో ప్రమాదంలో చిక్కుకున్న స్నేహితుడిని కాపాడేందుకు స్నేహితులు ఎలాంటి రిస్క్ తీసుకున్నారు అన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది.

రిస్క్ లో పడిన ఫ్రెండ్ ని వదిలేసి వెళ్లిపోకుండా తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి అతన్ని కాపాడుకునే ఈ సినిమా కథ కథనాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐతే ఈ సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే ఒకటి రెండు కాదు ఏకంగా 12 రెట్లు లాభాలు తెచ్చింది. అంటే సినిమా ఫుల్ రన్ లో 240 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. కల్కి, పుష్ప 2 సినిమాలు సూపర్ హిట్ సినిమాలే అవి 1000, 1500 కోట్లు కలెక్ట్ చేశాయి. కానీ వాటికి అయిన బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉంది.

కానీ మంజుమ్మల్ బోయ్స్ సినిమాకు వస్తే సినిమా కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తీశారు. సినిమా అంతా కూడా కథ పరంగా వెళ్తుంది. ఎక్కడ అనవసరమైన హంగులకు వెళ్లలేదు. అందుకే సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చేసింది. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఎన్ని ఉన్నా మంజుమ్మల్ బోయ్స్ వాటిలో చాలా ప్రత్యేకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News