అందుకే సినిమాలు వదిలేశాను: మన్మధుడు అన్షు
ఇటీవల మన్మధుడు రీ-రిలీజ్‌ను స్వాగతించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అన్షు ఈజ్ బ్యాక్ అని భావించారు.
అక్కినేని నాగార్జున సరసన 'మన్మధుడు' చిత్రంతో కథానాయికగా పరిచయమైంది అన్షు అంబానీ. ఆ తర్వాత ప్రభాస్ సరసన 'రాఘవేంద్ర' చిత్రంలో నటించింది. తమిళ చిత్రం 'జై'లో ప్రధాన పాత్ర పోషించింది. తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సాధించినా పెళ్లి తర్వాత నటనను కొనసాగించలేదు.
ఇప్పుడు అన్షు తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఇటీవల మన్మధుడు రీ-రిలీజ్‌ను స్వాగతించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అన్షు ఈజ్ బ్యాక్ అని భావించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అన్షు కనిపించేసరికి అభిమానులంతా ఆనందించారు. నాగార్జునతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను అన్షు అప్పట్లో నెమరువేసుకుంది. మన్మధుడు తర్వాత అన్షు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాఘవేంద్ర చిత్రంలో నటించింది. తరువాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమ నుండి కనిపించకుండా పోయింది. తమిళంలో ప్రశాంత్ నటించిన జై చిత్రంలో కనిపించింది. చివరికి తన విద్యను కొనసాగించడానికి తన జన్మస్థలమైన లండన్‌కు తిరిగి వెళ్లిపోయింది. అనంతరం వ్యాపారవేత్త సచిన్‌ను వివాహం చేసుకుంది. బ్రిటన్ రాజధాని నగరంలో లండన్ లో స్థిరపడింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.
అన్షు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. J. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన మన్మధుడు చిత్రానికి టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన పంచ్ డైలాగ్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. 2002లో విడుదలైన ఈ తెలుగు చిత్రం కన్నడలో రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన ఐశ్వర్య పేరుతో రీమేక్ అయింది. ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు అరంగేట్ర చిత్రం.
అన్షు 2003లో లండన్‌కు చెందిన సచిన్ సాగర్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తి కోల్పోయింది. కొన్నాళ్లకు తను హైదరాబాద్‌లో ఉన్నానని ఒక అప్‌డేట్‌ను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్.. మీ కోసం నేను సిద్ధంగా ఉన్నాను! అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తిని కలిగించింది. ఆ ఫోటోలో అన్షు ఎప్పటిలాగే అందంగా యవ్వనంగా కనిపించింది. అన్షు తిరిగి పెద్ద తెరపైకి వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆమె అభిమానులందరినీ ఉత్తేజపరిచింది.
ఆమె త్వరలో తిరిగి రానుందని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే అన్షు సినిమాల నుంచి ఎందుకు వైదొలిగింది? అన్నది శేష ప్రశ్నగా ఉంది. అయితే దానికి కారణం కూడా తాజా ఇంటర్వ్యూలో అన్షు వెల్లడించింది. కెరీర్ ఆరంభం తాను చేసిన పాత్రలన్నీ సెకండ్ హీరోయిన్ వే కావడంతో వాటితో విసుగొచ్చిందని అన్షు వెల్లడించింది. దాని కంటే సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండటమే నయమని భావించిందట.