విజ‌య్ నా డార్లింగ్ అంటూ కాంస్య ప‌త‌కాల లేడీ విన్న‌ర్!

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ పేరు మారు మ్రోగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-21 06:59 GMT

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ పేరు మారు మ్రోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. దేశ‌మంతా ఆమెని చూసి గ‌ర్విస్తుంది. ఈ సంద‌ర్భంగా మెడ‌లిస్ట్ ని త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ఎమ్. కె స్టాలిన్ ఆమెకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర డిస్క‌ష‌న్ సాగింది. ఆమెతో సరదాగా మాట్లాడిన స్టాలిన్.. తాను ఎవరో గుర్తు పట్టాలని ప్రశ్నించారు.

అయితే మను భాకర్ సీఎం స్టాలిన్‌ను గుర్తించడంలో ఇబ్బంది పడింది. ఆ వెంటనే విజయ్ గురించి ప్రశ్నించగా.. అతను తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది. దిగ్గజ హీరో అని, తన డార్లింగ్ అంటూ మురిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సంద్భంగా యువ‌త‌లో స్పూర్తిని నింపుతూ మ‌నుభాక‌ర్ స్పందించింది.

`పెద్ద కలలు కనాలి, వాటిని సాధించేందుకు కష్టపడాలి. ఫెయిల్ అయినా వదలకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను నా స్కూల్‌ డేస్‌లోనే కాంపిటీషన్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. స్కూల్ డేస్‌లో మనకు మొదట ఇంట్లో, తర్వాత స్కూల్లో సపోర్ట్‌ కావాలి. నాకు ఆ రెండూ లభించాయి. జీవితంలో డాక్టర్, ఇంజనీర్ మాత్రమే కాదు. అంతకు మించి చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రీడా రంగంలో ఎక్కువ అకాశాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ప్రయాణించాలనే కోరిక ఉన్న వాళ్లు స్పోర్ట్స్‌ కెరీర్‌ని ఎంచుకోవాలి. నేను ఇప్పటికే సగం ప్రపంచం ట్రావెల్‌ చేశాను.

మన నేపథ్యం గురించి చెప్పడంలో సిగ్గుప‌డాల్సిన ప‌నిలేదు. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ముఖ్యం కాదు. నాకు ఇంగ్లీష్ రాదు. చాలా విషయాలు తెలియవు. తర్వాత నేర్చుకున్నాను. వారు నేర్పించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు నేను చాలా నెర్వస్‌గా ఫీల్‌ అయ్యాను. నాకు ఆత్మ విశ్వాసం లేదు. వీటిని ఏదో ఒక దశలో వదిలేయాలి. అదే చేశాను. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాతే విజ‌యం వ‌చ్చింది` అన్నారు.

Tags:    

Similar News