ఐశ్వర్యారాయ్..సుస్మితా సేన్ లా తాను సిద్దమే!
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలంటైన్' తో పాటు..మరో రెండు మూడు సినిమాలు చేస్తోంది.
మాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ సుపరిచితురాలే. ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో 'సామ్రాట్ పృధ్వీరాజ్' లో కనిపించింది. కానీ అమ్మడికి డెబ్యూ ఆశించిన ఫలితా న్నివ్వలేదు. అటుపై నటించిన 'గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' కూడా నిరాశనమే మిగిల్చింది. అయినా ఆ వైఫల్యాలేవి మానుషి కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. కొత్త అవకాశాలు అందుకుంటూనే ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలంటైన్' తో పాటు..మరో రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన 'ఆపరేషన్ వాలంటైన్' ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చాయి. మార్చిలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా మానుషి కెరీర్ కి సంబంధించి ఆసక్తిర విషయాలు పంచుకుంది.
ఆవేంటో ఆమె మాటల్లోనే.. 'ప్రస్తుతం అనేది కేవలం ఏడాది మాత్రమే ఉంటుందేమో. ఆ తర్వాత కెరీర్ ని నిర్దేశించాల్సింది నటన మాత్రమే. మిస్ ఇండియా -మిస్ వరల్డ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు అనేవి కేవలం ఎంట్రీ వరకే. అవి పరిచయం చేయడం వరకే పరిమితం. నా దృష్టిలో అది కూడా కష్టమే. అలా కానీ పక్షంలో నటన అనేది తొలి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. కాల క్రమంలో మెరుగైన నటనతో మెప్పించాల్సి ఉంటుంది. నటి ఎప్పుడూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
ఆపరేషన్ వాలెంటైన్ ఫలితం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఐశ్వర్యరాయ్ - సుస్మితా సేన్ పోషించిన గ్లామర్ పాత్రలు నేను పోషించడానికి సిద్దంగా ఉన్నాను. అందాల పోటీ విజేతలుగా మాకు ఉన్న ఒక ఎడ్జ్ లాంటింది అది. నేను స్క్రీన్‌పై అల్ట్రా-గ్లామరస్ గా కనిపించడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాను' అని అంది. ప్రస్తుతం మానుషి బాలీవుడ్ లో 'బడేమియాన్ చోటేమియాన్' చిత్రంలోనూ నటిస్తోంది. 'ట్రెహ్రాన్' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.