మార్క్ ఆంటోనీ.. ఇది పరిస్థితి

కానీ తెలుగులో తమిళ రేంజ్​లో ప్రభావం చూపలేకపోతోంది. మొదటి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. రెండో రోజు కాస్త డ్రాప్ అయ్యాయి

Update: 2023-09-18 05:55 GMT

పందెం కోడి, పొగరు తదితర చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న హీరో విశాల్​. వరుస యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. తెలుగు బాక్సాఫీస్​లోనూ ఆయనకు మంచి మార్కెట్​ ఉంది. చాలా సినిమాలు ఇక్కడ మంచి హిట్లను అందుకున్నాయి. అయితే కొన్నేళ్ల నుంచి విశాల్ రొటీన్ మాస్ మసాలా చిత్రాలతో బోల్తా పడుతున్నారు. చివరగా వచ్చిన 'లాఠీ' మరీ పెద్ద హిట్​ను అందుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన గ్యాంగ్ స్టర్​ నేపథ్యంలో టైమ్​ ట్రావెల్ కాన్సెప్ట్​తో మార్క్ ఆంటోనీగా వచ్చారు. క్రేజీ ట్రైలర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ చిత్రం. సెప్టెంబర్​ 15న థియేటర్లలో రిలీజ్ అయింది. అందులోనూ ఈ వారం సరైన పోటీ లేకపోవడంతో చిత్రానికి బాగానే కలిసొస్తుందని అంతా అంచనా వేశారు.

అయితే ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ స్టేటస్​ను అందుకుంది. కానీ తెలుగులోకి వచ్చే సరికి కాస్త తేడా కొట్టింది. తొలి రోజు తమిళంతో పాటు తెలుగులోనూ డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. విశాల్ కెరీర్​లో ఎక్కువగా ఈ వసూళ్లు చాలా ఎక్కువే రూ.12 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు తమిళంలో మరింత ఊపందకుంది. ఆదివారం కూడా మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాలోని కామెడీ, ఎస్​ జే సూర్య నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం హౌస్​ ఫుల్​గా నడుస్తోంది.

కానీ తెలుగులో తమిళ రేంజ్​లో ప్రభావం చూపలేకపోతోంది. మొదటి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. రెండో రోజు కాస్త డ్రాప్ అయ్యాయి. సినిమాలోని ఓవర్ డోస్​ కామెడీని మనోళ్లు రిసీవ్ చేసుకోలేకపోతున్నారని. దీంతో ఈ చిత్రం మిక్స్​డ్​ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇది వసూళ్లపై కాస్త ఎఫెక్ట్ చూపింది.

ఇకపోతే ఈ చిత్రాన్ని అధిక్‌ రవిచంద్రన్‌ డైరెక్ట్ చేశారు. సినిమాలో విశాల్-ఎస్​ జే సూర్య గ్యాంగ్‌స్టర్లుగా కనిపించారు. రీతూవర్మ, సెల్వరాఘవన్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్‌ స్వరాలు సమకూర్చారు. విజయ్‌ వేలుకుట్టి - ఎడిటింగ్‌, అభినందన్‌ రామానుజం - సినిమాటోగ్రఫీ చూసుకున్నారు. ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు.

Tags:    

Similar News