రాజా సాబ్ నెక్స్ట్ గురి ఎవరు..?

ఐతే రాజా సాబ్ తో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా తర్వాత మారుతి నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

Update: 2024-12-29 04:47 GMT

గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసిన మారుతి సడెన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా టైం లోనే తన దగ్గర ఉన్న ఐడియా కథగా మార్చి యువి వాళ్ల చెవిలో వేశాడు. అది సూపర్ అనిపించడంతో ప్రభాస్ కి చెప్పి ఒప్పించేశారు. ముందు యువి బ్యానర్ లోనే ఈ సినిమా అనుకున్నా మధ్యలో పీపుల్ మీడియాకు ఇవ్వాల్సి వచ్చింది. ఆదిపురుష్ లెక్కల కారణంగా ఇలా ప్రాజెక్ట్ చేతులు మారిందని టాక్ ఉంది. ఏది ఏమైనా మారుతితో ప్రభాస్ అసలు ఏమాత్రం ఊహించని ఈ కాంబో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వనుంది.

మారుతి డైరెక్షన్ లో సినిమా అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా కథ మీద నమ్మకంతోనే ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నాడని క్లారిటీకి వచ్చారు. ఇక రాజా సాబ్ పోస్టర్స్, మోషన్ పొస్టర్ అంతా సినిమాపై మంచి బజ్ ఏర్పరిచాయి. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు.

ఐతే రాజా సాబ్ తో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా తర్వాత మారుతి నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కచ్చితంగా స్టార్ హీరోతోనే మరో పాన్ ఇండియా సినిమా ఉంటుంది. మారుతి ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రాజా సాబ్ మీదే ఉంచుతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మరో కథకు షిఫ్ట్ అవుతాడు. మారుతి ప్రభాస్ మాత్రం రాజా సాబ్ తో నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందివ్వాలని చూస్తున్నారు.

రాజా సాబ్ హిట్ పడితే స్టార్ హీరోలు కూడా మారుతి తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంటుంది. ఐతే మారుతి మాత్రం తన్ బెస్ట్ ఫ్రెండ్ అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే రాజా సాబ్ తర్వాత మారుతి లెవెల్ మారుతుంది కచ్చితంగా అతనికి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News