రవితేజ 'మాస్ జాతర' గ్లింప్స్.. ఫుల్ మీల్స్ పక్కా..

గ్లింప్స్ మెలోడీ మ్యూజిక్ తో మాస్ జాతర గ్లింప్స్ స్టార్ట్ అయింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో విలన్లను చితక్కొడుతున్న రెండు, మూడు సీన్లు చూపించారు మేకర్స్.

Update: 2025-01-26 07:28 GMT

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. సరైన హిట్ ను సొంతం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మాస్ జాతర సినిమాతో మంచి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.

భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రవితేజకు జోడీగా డ్యాన్సింగ్ క్వీన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ధమాకా మూవీ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు. ఇప్పుడు మరోసారి హిట్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా మాస్ జాతర మూవీ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రవితేజ అదరగొట్టేశారు. అదే సమయంలో నేడు ఆయన బర్త్ డే సందర్భంగా.. గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గ్లింప్స్.

గ్లింప్స్ మెలోడీ మ్యూజిక్ తో మాస్ జాతర గ్లింప్స్ స్టార్ట్ అయింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో విలన్లను చితక్కొడుతున్న రెండు, మూడు సీన్లు చూపించారు మేకర్స్. టీజర్ మొత్తం రవితేజ చాలా హుషారుగా కనిపించారు. రైల్వే స్టేషన్ లో ఓ అమ్మాయితో 'మనదే ఇదంతా' అంటూ ఇడియట్ మూవీ డైలాగ్ చెబుతారు.

ఆ అమ్మాయి శ్రీలీల అని అనిపిస్తుంది. మొత్తానికి గ్లింప్స్ తో మరోసారి వింటేజ్ రవితేజను చూడనున్నామని క్లియర్ గా తెలుస్తుంది. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో రవితేజ ఆకట్టుకున్నారు. ఫ్యాన్స్ కోరుకునే ఫుల్ మీల్స్ లా సినిమా ఉంటుందని క్లియర్ గా తెలుస్తుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

అలా ఓవరాల్ గా గ్లింప్స్.. సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. రవితేజ పక్కాగా హిట్ కొడతారని అంతా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మాస్ జాతర మూవీకి ఫుల్ టాలెంటెడ్ సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News