మత్తు వదలరా 2… రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందంటే..

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

Update: 2024-09-14 09:49 GMT

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు అన్ని కామెడీతో పాటు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొని థియేటర్స్ లోకి వచ్చి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ వరుసలో మత్తు వదలరా 2 మూవీ కూడా చేరబోతోంది. సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.


మత్తు వదలరా సీక్వెల్ గా ఈ మూవీని రితేష్ రానా తెరకెక్కించారు. శ్రీ సింహ, సత్య మొదటి సినిమా తరహాలోనే ఈ సీక్వెల్ లో కూడా తమదైన శైలిలో క్యారెక్టర్స్ ని పండించి ఫన్ జెనరేట్ చేశారు. శ్రీ సింహకి అయితే ఈ మూవీ హీరోగా బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ఇక సత్య అయితే సినిమాలో ఆధ్యంతం నవ్విస్తూనే ఉన్నాడు. వీరికి ఫరియా అబ్దుల్లా తోడవడంతో కథ ప్రేక్షకులు ఫుల్ గా ఫన్ ని ఆస్వాదించారు.

ఇదిలా ఉంటే మొదటి రోజు ఈ సినిమా 5.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసుకుంది. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో అదే స్థాయిలో జోరు చూపిస్తోంది. 24 గంటల్లోనే 40.36K టికెట్స్ అమ్ముడయ్యాయంట. దీనిని బట్టి ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. బుక్ మై షో యాప్ లో ఏకంగా 9.4 పబ్లిక్ రేటింగ్ పాయింట్స్ ని మత్తు వదలరా 2 సొంతం చేసుకుంది.

అంటే చూసిన ఆడియన్స్ అందరూ కూడా పాజిటివ్ గా రివ్యూలు ఇస్తున్నారని అర్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ జోరు చూస్తుంటే మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మత్తు వదలరా మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రితేష్ రానా మళ్ళీ సీక్వెల్ తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మూవీ నిర్మాతలకి భారీగా ప్రాఫిట్ తీసుకు రావడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ తో వచ్చి సక్సెస్ అందుకున్న మత్తు వదలరా 2 చూసిన తర్వాత భవిష్యత్తులో బడా నిర్మాతలు ఇలాంటి కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News