మత్తు వదలరా 2.. మిలియన్ రికార్డ్ కొట్టేసింది

శ్రీ సింహా హీరోగా సత్య ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది

Update: 2024-09-23 05:30 GMT

శ్రీ సింహా హీరోగా సత్య ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రితేష్ రానా తెరకెక్కించారు. రెండు గంటల పాటు ప్రేక్షకులు థియేటర్స్ లో హ్యాపీగా నవ్వుకునేలా కథని ప్రెజెంట్ చేసి రితేష్ రానా సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ‘మత్తు వదలరా’ కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ మొదటి చిత్రం కంటే రెట్టింపు సక్సెస్ ని అందుకుంది.

ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 30+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ లో ‘మత్తు వదలరా 2’ మూవీ 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. చిన్న సినిమాలలో వేగంగా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకున్న చిత్రంగా ‘మత్తు వదలరా 2’ నిలిచింది. సెప్టెంబర్ 27 వరకు పోటీలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ‘మత్తు వదలరా 2’ మూవీ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

సత్య తనదైన కామెడీతో మూవీలో ఆధ్యంతం నవ్విస్తూనే ఉన్నాడు. అలాగే వెన్నెల కిషోర్ కూడా మంచి ఫన్ క్రియేట్ చేశారు. ‘మత్తు వదలరా; తర్వాత హీరోగా శ్రీసింహకి ఇది రెండో సక్సెస్ అని చెప్పాలి. అలాగే ‘జాతిరత్నాలు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఫరియా అబ్దుల్లాకి ‘మత్తు వదలరా 2’ రూపంలో సాలిడ్ బ్రేక్ దొరికింది. ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ కి మాత్రమే కాకుండా ఫన్ రోల్స్ కి కూడా ఆమెని ఎంపిక చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

‘మత్తు వదలరా 2’ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా డబుల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. రితేష్ రానాకి కూడా ‘మత్తు వదలరా 2’ మూవీతో సూపర్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రితేష్ రానా నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ ఏంటనే క్యూరియాసిటీ పబ్లిక్ లో ఉంది. ‘మత్తు వదలరా పార్ట్ 3’ కూడా ఉంటుందని రితేష్ రానా ఇప్పటికే చెప్పారు. అయితే నెక్స్ట్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత మత్తు వదలరా పార్ట్ 3 మూవీ చేస్తానని రితేష్ రానా క్లారిటీ ఇచ్చాడు.

Tags:    

Similar News