గోల్డెన్ ప్రెస్ మీట్.. 'మెకానిక్ రాకీ' ప్రమోషనల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?
విశ్వక్ ఎప్పటిలాగే డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. జేక్స్ బెజోయ్ సంగీతం సమకూర్చారు. నవంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. విశ్వక్ ఎప్పటిలాగే డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
ముందుగా 'మెకానిక్ రాకీ' ఫస్ట్ గేర్ అంటూ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసి సంగీత ప్రియులను ఆకట్టుకున్న చిత్ర బృందం.. ట్రైలర్ 1.0 తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. రీసెంట్ గా ట్రైలర్ 2.0 రిలీజ్ చేసిన అంచనాలు కలిగించారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న విశ్వక్ సేన్.. రెగ్యులర్ గా అందరిలా ప్రెస్ మీట్స్ పెట్టకుండా, గోల్డెన్ ప్రెస్ మీట్ పేరుతో మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు.
జనరల్ గా జరిగే మీడియా Q&A సెషన్ మాదిరిగా కాకుండా.. రౌండ్ టేబుల్ లో తెలుగు మీడియా మిత్రులతో కూర్చొని జోవియల్ గా మాట్లాడుకునేలా ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. అంతేకాదు ‘మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్ పట్టు’ అంటూ మంచి ప్రశ్న అడిగిన పది మందికి ఒక గ్రాము బంగారు నాణేలను బహుమతిగా అందించారు. అందుకే మంగళవారం సాయంత్రం జరిగిన ఈ మీడియా మీట్ కి 'గోల్డెన్ ప్రెస్ మీట్' అని పేరు పెట్టారు. గోల్డ్ రాని వాళ్లకు వెండి నాణేలను గిఫ్ట్ గా ఇచ్చారు విశ్వక్ సేన్.
'మెకానిక్ రాకీ' గోల్డెన్ ప్రెస్ మీట్ కు సంబంధించిన వీడియోని మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఫన్నీగా సాగిన ఈ మీడియా ఇంటరాక్షన్ లో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ.. ''గోల్డ్ రాని వాళ్ళు బంగారు మనసుతో వెండి కాయిన్స్ తీసుకోండి. 'ఫలక్ నుమా దాస్' సినిమా చేసినప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయల బ్యాలన్స్ ఎప్పుడూ నేను చూడలేదు. ఇప్పుడు రెండు కేజీల వెండి కొని ఇచ్చేదాకా వచ్చా. ఇది చాలా లాంగ్ ఎమోషనల్ జర్నీ. ఈ జర్నీలో భాగమైన మీడియాకి కృతజ్ఞతలు'' అని అన్నారు.
విశ్వక్ సేన్ తో పాటుగా హీరోయిన్లు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్.. సీనియర్ నటుడు నరేష్ వీకే, రోడీస్ రఘు, నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకుడు రవితేజ కూడా ఈ ప్రెస్ పార్టీలో పాల్గొన్నారు. ఏదేమైనా రెగ్యులర్ గా ప్యాట్రన్ ను బ్రేక్ చేసి, డిఫరెంట్ గా విశ్వక్ చేస్తున్న ఈ ప్రమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. 'మెకానిక్ రాకీ' సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి, వారిని థియేటర్ల వరకూ రప్పించడానికి ఏ మేరకు హెల్ప్ అవుతాయో చూడాలి. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలలో ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.