టామ్ క్రూజ్‌లా అంత ఎత్తు నుంచి దూకిన మీనాక్షి
పారాగ్లైడింగ్ చేస్తున్న ఫోటోని షేర్ చేసిన ఈ బ్యూటీ ఇలా రాసారు. ``మొదటిసారి పారాగ్లైడింగ్ చేశాను... ఇష్టపడ్డాను!`` అని రాసారు.
హాలీవుడ్ సినిమాల్లోనే ఇలాంటివి చూడగలం! వామ్మోవ్ మీనాక్షి..! అంతెత్తు నుంచి దూకి ముచ్చెమటలు పట్టించేసింది. గాల్లో మీనాక్షి చౌదరి విన్యాసాలు చూస్తుంటే కళ్లు మిరుమిట్లు గొలిపాయి. దాదాపు 1800 మీ.ల నుంచి 2000 మీటర్ల ఎత్తు నుంచి పారా గ్లైడింగ్ కోసం గాల్లోకి దూకేసిందంటే మీనాక్షి గట్స్ ని మెచ్చుకోకుండా ఉండగలరా ఎవరైనా?! ఇలాంటి సాహసానికి గుండె ధిటవు తప్పనిసరి.
మిషన్ ఇంపాజిబుల్ కోసం టామ్ క్రూజ్.. బాండ్ 007 పాత్రను పండించడం కోసం డేనియల్ క్రెయిగ్ ఇలాంటి సాహసాలు చేసారు. గాల్లో విమానంలోంచి దూకేయడం వీళ్లకు చాలా సరదా వ్యాపకం. కానీ మీనాక్షి చౌదరి లాంటి ఒక తెలుగు కథానాయిక ఇలాంటి సాహసం చేసిందంటూ ఆశ్చర్యపోకుండా ఉండలేం. 10 అడుగుల గోడ ఎక్కి దూకాలంటేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది వందల మీటర్ల ఎత్తు నుంచి భయం లేకుండా గాల్లోకి జంప్ చేయడం అంటే ఆషామాషీనా! కానీ ఇలాంటి అసాధారణమైన ఫీట్ తో ఆశ్చర్యపరిచింది మీనాక్షి.
గుంటూరు కారంలో మహేష్ సరసన తనవైన నటవిన్యాసాలతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు దళపతి విజయ్ సరసన `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (GOAT)లో నటిస్తోంది. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మీనాక్షి కేరళలో హాలిడేని ఎంజాయ్ చేస్తోంది. ఇంతకుముందు MMA .. ముయే థాయ్ విద్యల్ని ప్రదర్శించిన మీనాక్షి ఇప్పుడు పారాగ్లైడింగ్‌లో తన గట్స్ ని చూపించింది. దేవుడి స్వంత దేశంలో ఈ సాహసానికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి గగుర్పాటుకు గురి చేసాయి. పారాగ్లైడింగ్ చేస్తున్న ఫోటోని షేర్ చేసిన ఈ బ్యూటీ ఇలా రాసారు. ``మొదటిసారి పారాగ్లైడింగ్ చేశాను... ఇష్టపడ్డాను!`` అని రాసారు.
విజయ్ ఆంటోని నటించిన `కొలై` చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి చివరిసారిగా RJ బాలాజీ నటించిన `సింగపూర్ సెలూన్`లో కనిపించింది. టాలీవుడ్ లో మహేష్, రవితేజ లాంటి స్టార్ల సరసన ఈ బ్యూటీ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ అగ్రహీరో విజయ్ సరసన వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న GOAT లో నటిస్తోంది. `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` చిత్రం వినాయక చతుర్థికి ముందు.. అంటే 5 సెప్టెంబర్ 2024 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, అజ్మల్ అమీర్, స్నేహ, లైలా, యోగి బాబు, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
పారా గ్లైడింగ్ గరిష్ఠ ఎత్తు ఎన్ని మీటర్లు?
పారాగ్లైడింగ్ కోసం ప్రభుత్వం కొన్ని పరిమితుల్ని విధించింది. ముఖ్యంగా 18,000 అడుగుల (సుమారు 5,000 మీటర్లు) కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లి జంప్ చేయాలనుకుంటే ముందుగా ప్రభుత్వం లేదా సంబంధిత శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్లైడర్ ఎల్లపుడూ లొకేషన్ మారుతూ ఉంటుంది కాబట్టి క్లాస్ G ఎయిర్‌స్పేస్ దాటి వెళ్లే ముందు చెక్ చేయాల్సి ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అధిక ఎత్తునుంచి సురక్షితంగా కిందికి దిగడం అసాధ్యం.