ఆ విషయంలో లక్కీ అంటున్న మీనాక్షి
వరుస సినిమాలతో కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షికి ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు మీనాక్షి చౌదరి. వరుస సినిమాలతో కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షికి ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ హర్యానా భామ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితోనూ ఛాన్స్ అందుకుంటుంది.
దీంతో అందరూ మీనాక్షిని లక్కీ హీరోయిన్ ను చేసేశారు. మహేష్ బాబు తో గుంటూరు కారంలో ఆఫర్ రావడంతో అమ్మడి దిశ తిరిగిపోయిందనుకున్నారు. కానీ ఆ మూవీలో అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో మీనాక్షి ఫ్యాన్స్ నిరాశ చెందారు. తమిళంలో కూడా విజయ్ గోట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది కానీ ఆ సినిమాలో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండదు.
అయితే గోట్ సినిమాను ఓకే చేసి తొందరపడ్డాననే అభిప్రాయాన్ని మీనాక్షి చౌదరి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సింగపూర్ సెలూన్ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన మీనాక్షి ఆ తర్వాత కొలై సినిమా చేసింది. ఆ తర్వాత విజయ్ తో కలిసి గోట్ సినిమా చేసింది. అయితే గతేడాది అమ్మడు నటించిన లక్కీ భాస్కర్ సూపర్ హిట్ అవడంతో తనకు క్రేజ్ పెరిగింది.
ఇక రీసెంట్ గా తెలుగులో విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ తర్వాత తన ఫాలోయింగ్ మరింత పెరిగింది. వరుస హిట్స్ లో ఉన్న మీనాక్షికి ఈ ఇయర్ ఎంతో స్పెషల్ అని, తన లైఫ్ లో ఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మీనాక్షి వెల్లడించింది.
ఇండస్ట్రీలో ఎంతో అనుభవమున్న వారికి కూడా మంచి కథల్లో నటించే అవకాశాలు రావడం లేదని, అలాంటిది తనకు కెరీర్ స్టార్టింగ్ లోనే పలు మంచి సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినందుకు తాను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నట్టు మీనాక్షి తెలిపింది.