చీరకే అందాన్ని తెచ్చిన మీనాక్షి

ఈ ఫోటోషూట్ వెనుక ఉన్న ఫ్యాషన్ టీమ్ తన పనితనాన్ని చక్కగా చూపించింది. స్టైలిస్ట్ కళ్యాణి ఈ ట్రెడిషనల్ లుక్‌ను మోడ్రన్ టచ్ తో ప్రెజెంట్ చేయడంలో విజయవంతమయ్యారు.

Update: 2025-02-22 11:52 GMT

టాలీవుడ్ లో గ్లామర్ తో పాటు సింప్లిసిటీ కి ప్రాధాన్యం ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి. తాజాగా ఆమె షేర్ చేసిన చీరలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ సారీలో ఆమె వయ్యారాలు అభిమానులను ముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి ఫోటోలోనూ ఆమె కళ్ళల్లో కనిపించే ఆకర్షణ, హావభావాలు నెటిజన్ల మనసులను కట్టిపడేస్తున్నాయి.

 

మీనాక్షి ధరించిన ఈ డార్క్ గ్రీన్ చీర గోల్డెన్ ఫ్లోరల్ ప్రింట్ తో మరింత అందంగా కనిపిస్తోంది. చీరకే మ్యాచ్ గా ఉన్న బ్రౌన్ బ్లౌజ్ ఆమె లుక్కు పూర్తిగా ఎలివేట్ చేస్తోంది. సింపుల్ హెయిర్ స్టైల్, సున్నితమైన మేకప్ తో ఆమె సౌందర్యం మరింత హైలైట్ అవుతోంది. గ్రీన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె ఫోటోషూట్ సింపుల్‌గా ఉంటూనే అద్భుతంగా ఆకట్టుకుంటోంది.

 

ఈ ఫోటోషూట్ వెనుక ఉన్న ఫ్యాషన్ టీమ్ తన పనితనాన్ని చక్కగా చూపించింది. స్టైలిస్ట్ కళ్యాణి ఈ ట్రెడిషనల్ లుక్‌ను మోడ్రన్ టచ్ తో ప్రెజెంట్ చేయడంలో విజయవంతమయ్యారు. ఈ అందమైన ఫోటోలు చూసిన అభిమానులు కామెంట్స్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "చీరకే అందాన్ని తెచ్చిన మీనాక్షి", "సింప్లిసిటీ లోనే గ్లామర్", "గ్రీన్ లో ఏంజెల్" వంటి కామెంట్లు దర్శనమిస్తున్నాయి. మీనాక్షి ఫ్యాషన్ సెన్స్, స్టైల్, గ్లామర్ కి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఫ్యాన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది.

 

ప్రస్తుతం మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. గత ఏడాది "లక్కీ భాస్కర్" చిత్రంతో బిగ్ సక్సెస్ అందుకున్న ఈ లక్కీ హీరోయిన్ ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బిగ్ హిట్ సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో ఆమె మంచి గుర్తింపుని ఆ దుకుంటోంది.

 

ఇక ఈ ఫోటోషూట్‌తో మరోసారి ఆమె సాంప్రదాయ గ్లామర్ క్వీన్ గా నిలిచింది. రాబోయే కాలంలో ఆమెకు మరిన్ని బిగ్ ఆఫర్స్ రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News