మీనాక్షి.. ఈసారి కొట్టాల్సిందే!

ది గోట్ తర్వాత.. ఇప్పుడు మాలీవుడ్ స్టార్ హీరో లక్కీ భాస్కర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఆ మూవీ రిలీజ్ కానుంది.

Update: 2024-10-20 05:22 GMT

మీనాక్షి చౌదరి.. టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ సెన్సేషన్ బ్యూటీస్ లో ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అమ్మడు.. ఇప్పుడు స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుని సీనియర్స్ కు షాక్ ఇస్తోంది. అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు మూవీతో తెలుగు సినీ ప్రియులకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో నటించే ఛాన్స్ ను అందుకున్నారు.

ఖిలాడీ అంటూ తన గ్లామర్ షోతో ఆకట్టుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. ఆ తర్వాత అడివి శేష్ హిట్-2 మూవీతో మంచి బ్రేక్ దక్కించుకుంది. గ్లామర్ షోతో పాటు లిప్ లాక్ సీన్స్ లో వేరే లెవెల్ లో నటించారు. హిట్-2 తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో కనిపించారు. కానీ ఆమె రోల్ కు సినిమాలో పెద్దగా స్కోప్ లేదని చెప్పాలి. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. ది గోట్ మూవీలో మీనాక్షి ఒక రోల్ చేసింది.

గుంటూరు కారంలో అలా జరిగితే.. గోట్‌లో సాంగ్స్, మూడు సీన్స్‌ కే పరిమితం అయిపోయారు. దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంటున్నా.. సరైన సక్సెస్ ను దక్కించుకోవట్లే. ఎన్ని ఛాన్సులు వచ్చినా సక్సెస్ రేట్ ముఖ్యం కదా.. ప్రస్తుతం మీనాక్షి దాని కోసమే వెయిట్ చేస్తున్నారు. ది గోట్ తర్వాత.. ఇప్పుడు మాలీవుడ్ స్టార్ హీరో లక్కీ భాస్కర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఆ మూవీ రిలీజ్ కానుంది.

అదే సమయంలో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నా అమ్మడు మరోవైపు.. మెగా హీరో వరుణ్ తేజ్ మట్కాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు.. త్వరలో థియేటర్లలోకి రానున్నాయి. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలోనూ భాగమైనట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

దీంతో ఇప్పుడు లక్కీ భాస్కర్ తో మీనాక్షి మంచి హిట్ కొట్టాల్సిందేనని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ బట్టి.. ఆమెకు మంచి స్కోప్ ఉన్న రోల్ దక్కిందని అర్థమవుతుంది. అదే నిజమై.. మీనాక్షి తన నటనతో అదరగొడితే తిరుగులేదు. ఇక మూవీ హిట్ అయితే ఆమె కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు. మరి డైరెక్టర్ వెంకీ అట్లూరి.. లక్కీ భాస్కర్ లో మీనాక్షి రోల్ ను ఎలా డిజైన్ చేశారో? ఆమె ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News