మెగా హీరో కొత్త ప్రయోగమా..?
ఐతే ఆదికేశవ్ రిజల్ట్ తర్వాత మెగా హీరోలు అదే మెగాస్టార్ చిరంజీవి కూడా వైష్ణవ్ కెరీర్ మీద కాస్త ఫోకస్ చేయాలని అనుకుంటున్నారట.;

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ అందుకున్న సక్సెస్ గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యువ హీరో మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్ టచ్ చేశాడు. ఉప్పెన హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా అతని చివరి సినిమా ఆదికేశవ్ అయితే డిజాస్టర్ కా బాప్ అనిపించింది.
మెగా మేనల్లుడిగా ఎంట్రీ బాగానే దొరికినా నెక్స్ట్ సినిమాలు అతని మార్క్ చూపించలేకపోయాయి. మరోపక్క సాయి తేజ్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. వైష్ణవ్ తేజ్ మాత్రం కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఐతే నెక్స్ట్ సినిమా చేస్తే ఒక ఎక్స్ పెరిమెంట్ చేయాలని చూస్తున్నాడట వైష్ణవ్ తేజ్. ఉప్పెన స్టోరీ చేయడం ఒక రకంగా హీరోగా రిస్క్ అన్నట్టే కానీ తొలి సినిమానే అలాంటి అటెంప్ట్ చేశాడు వైష్ణవ్ తేజ్.
ఇక ఆ నెక్స్ట్ కొండపొలం అంటూ క్రిష్ తో కలిసి చేశాడు. ఆ సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు. రాంగ రంగ వైభవంగా సినిమా రొటీన్ అనిపించగా ఆది కేశవ్ ఏమాత్రం అంచనాలు అందుకోలేదు. ఇలా ఉప్పెన తర్వాత ప్రతి సినిమా డిజప్పాయింట్ చేసింది. ఐతే ఈసారి ఎలా పడితే అలాంటి సినిమా కాకుండా కచ్చితంగా ష్యూర్ షాట్ హిట్ ఇచ్చే కథ కోసమే వెతుకుతున్నాడట వైష్ణవ్ తేజ్.
ఎంత మెగా సపోర్ట్ ఉన్నా యువ హీరోగా తన కథలు తానే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐతే ఆదికేశవ్ రిజల్ట్ తర్వాత మెగా హీరోలు అదే మెగాస్టార్ చిరంజీవి కూడా వైష్ణవ్ కెరీర్ మీద కాస్త ఫోకస్ చేయాలని అనుకుంటున్నారట. వైష్ణవ్ కి నచ్చిన కథలను చిరంజీవి కూడా విని ఓకే చేయాలని చూస్తున్నారట. ఐతే తేజ్ ఎలాగు ప్రస్తుతం సంబరాల యేటిగట్టు సినిమా చేస్తున్నాడు. అది భారీ రేంజ్ లో రాబోతుంది.
ఇక ఇదే క్రమంలో వైష్ణవ్ తేజ్ కూడా మంచి స్టోరీతో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఆ కథ ఏంటి వైష్ణవ్ తేజ్ చేసే ప్రయోగం ఏంటన్నది తర్వాత తెలుస్తుంది. మళ్లీ కెరీర్ లో ఉప్పెన లాంటి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వైష్ణవ్ తేజ్ కి ఆ రేంజ్ సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి.