మట్కా తో ఇచ్చి పడేసిన వరుణ్

ఇలాంటి ఫైరీ లుక్ ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచడం ఖాయం. ఈ సినిమా దర్శకుడు కరుణ కుమార్ ఇదివరకే తనదైన మేకింగ్ స్టైల్ తో దర్శకుడిగా గుర్తింపు అందుకున్నారు.

Update: 2024-10-15 12:30 GMT

వ‌రుణ్ తేజ్ "మట్కా" టీజర్‌తో సినీ ప్ర‌పంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాడు. టీజర్ విడుదలైన వెంట‌నే సామాజిక మాధ్యమాల్లో 10 మిలియన్‌కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. వ‌రుణ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌ల‌ను పోషించిన వ‌రుణ్‌ తేజ్, గ్యాంగ్‌స్ట‌ర్ లుక్‌లోకి మారడం అనేది మామూలు విషయం కాదు.

 

మొదట ఇలాంటి స్టోరీ వరుణ్ చేస్తున్నాడనే వార్తలు రాగానే, అతను చేయగలడో లేదో అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు, అతని నూతన రఫ్ అండ్ టఫ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొత్తగా విడుద‌లైన పోస్ట‌ర్‌లో వ‌రుణ్ తేజ్ స్టైల్‌, అటిట్యూడ్‌ తో ఇచ్చి పడేశాడు అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ లుక్ మరింత హై లెవెల్‌లో కనిపిస్తోంది. చేతిలో సిగరెట్, గ‌న్‌ పట్టుకొని సోఫాపై తేలిక‌గా కూర్చొని కనిపిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ లుక్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. గద్దలకొండ గణేష్ తప్పిస్తే ఎక్కువగా ప్రేమకథల్లో పక్కింటి అబ్బాయిలా సౌమ్యంగా కనిపించిన వ‌రుణ్‌ ఈ కొత్త పాత్ర‌లో కనిపించడం ఒక ప్రయోగమే. అతని రూపంలో మెరుగైన మేకోవర్ మాత్రమే కాకుండా, ఆ పాత్రకు తగినంత కఠినతను అతడు ప్రదర్శించడం విశేషం.

ఇలాంటి ఫైరీ లుక్ ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచడం ఖాయం. ఈ సినిమా దర్శకుడు కరుణ కుమార్ ఇదివరకే తనదైన మేకింగ్ స్టైల్ తో దర్శకుడిగా గుర్తింపు అందుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఇక ఇప్పుడు మట్కా సినిమాను అంతకుమించి అనేలా డిఫరెంట్ గా తెరపైకి తీసుకు రాబోతున్నాడు.

ఇక నిర్మాతలు SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. 'మట్కా' చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్ విడుదలైనప్పటి నుంచే వ‌రుణ్ తేజ్ పాత్రపై చర్చ మొదలైంది. ఈ సినిమాలోని అతని పాత్ర పేరు మట్కా వాసు. కథానాయకుడిగా ఈ పాత్ర పోషించడానికి వ‌రుణ్ తేజ్‌ ఎంతో కష్టపడి శ్రద్ధ తీసుకున్నారని సమాచారం.

పోస్టర్స్ తోనే అతని డెడికేషన్‌ కనిపిస్తుంది. పాత్రలో ఒదిగిపోవడానికి అతని శారీరక భాష, ఆవేశపూరిత అభినయమే ప్రధానంగా నిలుస్తాయి. గ్యాంగ్‌స్టర్ పాత్రను ఈ స్థాయిలో ప్రదర్శించడం, ఇంత న్యూ లుక్ లోకి మారడంతో వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నారు. ఈ పోస్టర్ కూడా సినిమాపై భారీ బజ్‌ క్రియేట్ చేస్తోంది. టైటిల్ పోస్టర్ నుంచి లేటెస్ట్ లుక్స్‌ వరకు ‘మట్కా’ టీమ్ ప్రతి అప్డేట్ ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేస్తోంది. కాబట్టి విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ ఈ మూవీపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

Tags:    

Similar News