వరుణ్ నెక్స్ట్.. ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్ లోడింగ్!

ఇప్పుడు మరోసారి ఆ సంస్థ నిర్మాణంలో వరుణ్ తో సినిమా చేస్తున్నారు. మంచి అట్రాక్టివ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీలో వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Update: 2024-12-01 11:52 GMT

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యమైన కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రకరకాల జోనర్లలో చిత్రాలు చేస్తున్నా సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

 

గద్దలకొండ గణేష్‌ తర్వాత వరుసగా సినిమాలు చేసినా గట్టి కమ్ బ్యాక్ సొంతం చేసుకోలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన మట్కా మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో భారీ హిట్ కొడదామనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద మట్కా దారుణంగా నిరాశపరిచింది. వరుణ్ కెరీర్ లో మరో ఫ్లాప్ చేరింది.

దీంతో వరుణ్ కాస్త బ్రేక్ తీసుకుంటారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ అవేం నిజం కాదు! ఇప్పుడు ఆయన కొత్త మూవీ వర్క్స్ తో బిజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఓ పెర్ఫెక్ట్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఇప్పటికే వరుణ్ కథ విని ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు మేకర్స్.

టాలీవుడ్ ప్రముఖ యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా వరుణ్- మేర్లపాక గాంధీ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ ఫస్ట్ ఫ్రేమ్స్ సంస్థతో కంచె సినిమాకు గాను వర్క్ చేశారు. ఆ మూవీ మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు యూవీ బ్యానర్ తో తొలిసారి జత కడుతున్నారు.

అదే సమయంలో మేర్లపాక గాంధీ యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఎక్స్ ప్రెస్ రాజా మూవీ చేయగా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఆ సంస్థ నిర్మాణంలో వరుణ్ తో సినిమా చేస్తున్నారు. మంచి అట్రాక్టివ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీలో వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. విలక్షణమైన పాత్రలో వరుణ్ కనిపించనున్నారట.

అయితే వరుణ్ తేజ్ తో పాటు మేర్లపాక గాంధీ కూడా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన చివరి రెండు సినిమాలు లైక్ షేర్ సబ్‌ స్క్రైబ్, కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు వరుణ్ కు మంచి హిట్ ఇచ్చి తాను కూడా కొట్టాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఇద్దరికీ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News