మెగా157: ఈ ఇంట్రో అదిరింది!
ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటమే కాదు, మెగాస్టార్ అభిమానుల హృదయాలను కూడా హత్తుకుంది.;

మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలని కలలు కనే దర్శకుల లిస్టు చాలానే ఉంటుంది. ఇక ఆ కలను జెట్ స్పీడ్ లోనే గౌరవప్రదంగా నిజం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. కమర్షియల్ సక్సెస్‌లు, కామెడీ టైమింగ్, మాస్ ఎమోషన్స్‌లో తను తీసిన సినిమాలతో ఇప్పటికే డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్, ఇప్పుడు మెగాస్టార్‌తో కలిసి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కి రూపకల్పన చేశాడు. ఇది కాకుండా, తనదైన శైలిలో టీమ్ ని పరిచయం చేస్తూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అనిల్ రావిపూడి స్టైల్ అంటేనే ప్రేక్షకుల మధ్య ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మెగా157 టీమ్‌ను పరిచయం చేయడంలోనూ అదే సృజనాత్మకతను చూపించాడు. చిరంజీవిగారి సినిమా కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలను ప్రతి డిపార్ట్‌మెంట్‌కు పోల్చుతూ యూనిట్‌ను పరిచయం చేశాడు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటమే కాదు, మెగాస్టార్ అభిమానుల హృదయాలను కూడా హత్తుకుంది.
ఈ వీడియోలో, డైరెక్షన్ టీమ్‌ను ‘చూడాలని ఉంది’, డైలాగ్ రైటింగ్‌కు ‘అన్నయ్య’, కో–రైటర్ నారాయణను ‘హిట్లర్’కి పోల్చాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణను ‘రౌడి అల్లుడు’లోని పాత్రతో, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్‌ను ‘ముటా మేస్త్రి’తో కంపేర్ చేశాడు. ఎడిటర్ తమ్మిరాజును ‘ఇంద్ర’గా, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ను ‘మాస్టర్’గా పరిచయం చేశారు.
ప్రొడ్యూసర్లు సహూ గారపాటి, సుష్మిత కొణిదెలలను ‘శంకర్ దాదా MBBS’ పాత్రతో హైలెట్ చేశారు. చివరిగా అనిల్ రావిపూడినే ఈ గ్యాంగ్ లీడర్‌గా తనను తానే పరిచయం చేసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. అంతే కాకుండా రఫ్ఫాడించేద్దాం అంటూ మొదలెట్టేశారు. ఒక్కో క్లాసిక్ సినిమాతో జత చేస్తూ యూనిట్ సభ్యులందరిని ప్రేక్షకులకు పరిచయం చేయడం అనిల్ గొప్ప ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది. ఇది కేవలం జ్ఞాపకాలను మాత్రమే కాదు, చిరంజీవి కెరీర్‌ను ఒకసారి తిరిగి చూపించినట్టే అయ్యింది.
ఇక వీడియోలో చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెలతో మాట్లాడుతూ, "కొణిదెల పేరు నిలబెట్టాలి" అనే మాటలు చెప్పడం మరో హైలెట్ మూమెంట్ గా నిలిచింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు మెగాస్టార్ పై చిన్న చిరునవ్వును చూడగలిగారు. ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడం సహజం. దీనిపై టీమ్ కూడా హైపే ఇవ్వకుండా, తనదైన శైలిలో అన్ని విభాగాలను పరిచయం చేస్తూ అంచనాలను రెట్టింపు చేశారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026కి విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించేశారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు సినిమాకు సంబంధించిన అన్ని పనులను ఫినిష్ చేయాలనే టార్గెట్ తో అనిల్ టీమ్ వర్క్ చేస్తోంది.