'లియో'పై మెగా ఫ్యాన్స్ గుస్సా
దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ.. దీనిపై సైలెన్స్ మైంటైన్ చేస్తూనే వచ్చాడు.
'లియో' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు అంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగి తెలిసిందే. అయితే ఈ రూమర్ మొదట చిన్నగానే మొదలైంది. కానీ ఆ తర్వాత మరింత ఎక్కువ అయిపోవడంతో అంతా నిజమేనని అంతా అనుకున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇది నిజం కాదని తెలిపోయింది. దీంతో ఈ విషయమై మెగా ఫ్యాన్స్ కాస్త గరమ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళితే.. 'లియో' సినిమా మరో రోజులో రిలీజ్ కానుంది. మూవీటీమ్ గత కొద్ది రోజులుగా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే చిత్రంలో చరణ్ ఉన్నాడంటూ, 'కోబ్రా' అనే పాత్ర అంటూ చాలా ఎక్కువగా ప్రచారం సాగింది. అయితే ఈ రూమర్స్‌ను అడిషనల్ ప్రమోషన్ కింద మూవీటీమ్ లెక్కేసినట్టుంది! మూవీలో రామ్ చరణ్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని ఇన్ని రోజుల పాటు క్లారిటీ ఇవ్వకుండా సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది.
దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ.. దీనిపై సైలెన్స్ మైంటైన్ చేస్తూనే వచ్చాడు. సినిమాకు ఎలాగో ప్రమోషన్ వస్తోంది కాబట్టి.. అనవసరంగా మాట్లాడి ఓపెన్ అవ్వడం ఎందుకు అనేది యూనిట్ ఆలోచించినట్టుంది! అడిషనల్ పబ్లిసిటీ ఎందుకు వదిలేయడం అని భావించిందేమో! ఇక సినిమాకు ఒక్క రోజు ఉంది అనగా.. ఇప్పుడు సడెన్‌గా క్లారిటీ ఇచ్చారు.
దీంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. చరణ్ లేడని తెలియడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోను వాడుకుని పబ్లిసిటీ పొందారు విమర్శిస్తున్నారు. ఇంతకాలం ఈ విషయంపై మేకర్స్ ఎందురు రెస్పాండ్ అవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. చిన్న రూమర్‌ను కావాలనే మూవీటీమే పెద్దది చేసిందని అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రామ్‌చరణ్ పేరుతో పబ్లిసిటీ తెచ్చుకున్నారని అంటున్నారు. ఒకరంగా మెగా ఫ్యాన్స్ బాధలో అర్థం ఉందనే చెప్పాలి. మేకర్స్ కూడా ఇంత కాలం దాచి ఇప్పుడు ఓపెన్ అయితే ఎలా?.. చరణ్ పేరు వాడుకుని తెలుగులో భారీ బజ్ క్రియేట్ చేసినట్టైంది! ఒకరంగా ఇక్కడ లోకేశ్-దళపతి ఇమేజ్‌తో లియోకు హైప్ ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఇంతటి స్థాయిలో లో రావడానికి కారణం చరణ్ పేరు ఉండటమనే చెప్పాలి. అందుకే ఇప్పుడు చరణ్ లేడని తెలియడంతో మెగా ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారని తెలుస్తోంది!