మెగా ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ !

అందుకే ప్రొడక్షన్ కాస్ట్ కాస్త ఎక్కువ అవుతుందని తెలుస్తున్నా నిర్మాతలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.

Update: 2024-07-28 13:30 GMT

మెగా ఫ్యాన్స్ అంతా కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను వశిష్ట డైరెక్ట్ చేస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు సూపర్ బూస్ట్ ఇస్తుందని అంటున్నారు. విశ్వంభర సినిమా ఆడియన్స్ కు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే ప్రొడక్షన్ కాస్ట్ కాస్త ఎక్కువ అవుతుందని తెలుస్తున్నా నిర్మాతలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.

స్టార్ సినిమాలు ఈమధ్య కథ మీద నమ్మకంతో కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దానికి కావాల్సినంత బడ్జెట్ పెట్టేస్తున్నారు. విశ్వంభర సినిమా విషయంలో కూడా అంతే కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోని సినిమాకు కావాల్సినంత బడ్జెట్ సమకూరుస్తున్నారు. ఐతే చిరంజీవి విశ్వంభర సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ రోజు ఒక టీజర్ వచ్చింది తప్ప మిగతా అప్డేట్స్ ఏమి రాలేదు. గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు.

ఐతే మెగా ఫ్యాన్స్ అంతా కూడా విశ్వంభర టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరు సినిమా టీజర్ ఎలా ఉండబోతుంది అన్న ఎగ్జైట్ మెంట్ మొదలైంది. సినిమా గురించి శాంపిల్ గా క్లూ ఇస్తూ వదిలే టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఈ క్రమంలో విశ్వంభర టీజర్ ఎలా ఉండబోతుంది. సినిమాలో చిరు ఎలా కనిపిస్తారన్న ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో ఉంది. అందుకే చిరు సినిమా టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఆగష్టు 22 చిరంజీవి బర్త్ డే. మెగా ఫ్యాన్స్ పండగలా జరుపుకునే ఈ రోజు మెగా విశ్వంభర టీజర్ రాబోతుందని తెలుస్తుంది. సో ఆరోజు మెగా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. విశ్వంభర మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి కూడా బర్త్ డే రోజు ప్రకటన వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి మెగాస్టార్ పుట్టినరోజు మెగా ఫ్యాన్స్ కు భారీ కానుకలే ఇచ్చేలా సెట్ చేశారని తెలుస్తుంది. చిరు నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉంటుందని లేటెస్ట్ టాక్. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఒక మంచి మాస్ బొమ్మ అందించేందుకు హరీష్ శంకర్ కృషి చేస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న మిస్టర్ బచ్చన్ ఆగష్టు 15న రిలీజ్ అవుతుండగా ఆ సినిమా ప్రచార చిత్రాలైతే అదిరిపోయేలా ఉన్నాయి.

Tags:    

Similar News