ఈ ముగ్గురు మెగా హీరోలపై అసంతృప్తి!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా కాస్త స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా కాస్త స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ఒకరు ఇద్దరు మినహా ఎక్కువ మంది స్టార్స్ ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకోవడం లేదు. ఏడాదికి కనీసం ఒక్కటి అన్నట్లుగా సినిమాలను వదులుతూనే ఉన్నారు.
ఇక టైర్ 2 హీరోల విషయానికి వస్తే ఏడాదిలో మినిమం రెండు సినిమాల చొప్పున చేయాలనే పట్టుదల చాలా మందిలో కనిపిస్తోంది. నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, నితిన్, నిఖిల్ ఇంకా కొందరు ఏడాదిలో మినిమం రెండేసి సినిమాల చొప్పున చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అదే టైర్ 2 జాబితాలో ఉండే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ లు మాత్రం సినిమాల విషయంలో నత్త నడకను కనబర్చుతున్నారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
ఈ ముగ్గురు మెగా హీరోలపై మెగా ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ సినీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి అంచనాలు ఉన్నాయి. కానీ వీరు మాత్రం సినిమాలతో జోరు కనబర్చడం లేదు. అంతే కాకుండా సినిమాల విషయంలో ఈ మెగా హీరోలు సరైన నిర్ణయాలను కూడా తీసుకోలేక పోతున్నారు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. మరో వైపు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా సూపర్ హిట్ అయినా కూడా సినిమాల ఎంపిక విషయంలో స్పీడ్ కనబర్చడం లేదు.
ఉప్పెన తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టైర్ 2 హీరోల జాబితాలో చోటు సంపాదించిన వైష్ణవ్ తేజ్ కూడా వరుసగా ఫ్లాప్స్ పడటంతో తదుపరి సినిమాను ఇంకా కూడా కమిట్ అవ్వలేదు. మొత్తానికి ఈ ముగ్గురు సినిమాల ఎంపిక మరియు సినిమాలు చేస్తున్న తీరుపై మెగా ఫ్యాన్స్ లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి హీరోలు ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా మినిమం హిట్స్ దక్కుతాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం.