ఆఫర్స్ కాదు వరుణ్.. కంటెంట్ చూస్కో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్లిపోతున్నారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్లిపోతున్నారు. ఒకే రకమైన సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారని అనే గుర్తింపు కూడా పొందారు. ముకుంద.. తన తొలి సినిమాతోనే ఒక ప్రయోగంగా చేసిన వరుణ్ తేజ్ ఆ తర్వాత కంచె, అంతరిక్షం వంటి సినిమాలతో పాటు తాజాగా వచ్చిన గాండీవధారి అర్జున వరకు తన ఎక్స్పెరిమెంట్ పంథాను కొనసాగించారు.
అయితే ఇప్పుడు ఈ ప్రయోగాత్మక సినిమాలన్ని ఎంత వరకు సక్సెస్ అయ్యాయనే విషయానికొస్తే.. ఇందులో చాలా చిత్రాల వరకు అన్నీ ఫ్లాప్‌లుగానే నిలిచాయి. అప్పుడప్పుడు మధ్యలో ఫిదా, గద్దలకొండ గణేశ్, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మాత్రం ఆడాయి. ఇక వరుణ్ నటించిన గత రెండు సినిమాలైతే దారణమైన పరాజయాలను అందుకున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చాయి.
బాక్సింగ్-మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన గని అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. అల్లు బాబీ కంపెనీ, రినైస్సెన్స్ పిక్చర్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. దాదాపు రూ.25కోట్ల బడ్జెట్‌తో భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధుకు నష్టం చేకూర్చింది. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర లాంటి స్టార్ కాస్ట్ ఉన్నా సినిమాకు అస్సలు ప్లస్ కాలేకపోయింది. కథలో దమ్ము లేకుండటం వల్ల ప్రేక్షకులు డిజాస్టర్‌ను అందించారు. దీంతో వరుణ్.. నష్టపోయిన తన నిర్మాతలకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు.