మెగాస్టార్‌ మూడు సినిమాలు@2025

ఆ లోటును భర్తీ చేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారు.

Update: 2025-02-15 10:30 GMT

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఒక్క సినిమా కూడా గత ఏడాదిలో విడుదల కాలేదు. ఆ లోటును భర్తీ చేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, వచ్చే ఏడాదిలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాటు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలోనూ ఒక సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఒకే సినిమాతో చిరంజీవి వచ్చే అవకాశాలు ఉన్నా, మూడు సినిమాల షూటింగ్‌ ఇదే ఏడాది జరిగే అవకాశాలు ఉన్నాయి. విశ్వంభర సినిమా మరో నెల రోజుల్లో షూటింగ్‌ పూర్తి కానున్నట్లు సమాచారం అందుతోంది.

ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ దక్కించుకున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఏప్రిల్‌ లేదా మే నెలలో సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు గాను దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సాహు గారపాటి క్లారిటీ ఇచ్చాడు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం ఈ సినిమా షూటింగ్‌ను సమ్మర్‌లో ప్రారంభిస్తామని ప్రనకటించాడు. అంతే కాకుండా సినిమాను ఎక్కువ ఆలస్యం చేయకుండా 2025 సంక్రాంతికి విడుదల చేసే విధంగా షూటింగ్‌ను స్పీడ్‌గా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఏడాదిలోనే అనిల్‌ రావిపూడి సినిమాను ముగించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం నానితో సినిమాను చేస్తున్న దసరా చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తదుపరి సినిమానుచిరంజీవి హీరోగా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నాని ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల చెప్పిన కథకు చిరంజీవి ఫిదా అయ్యారని, ఆయన తన కూతురు సుష్మితను ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా చేయనున్నారు అంటూ తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌ ఇదే ఏడాదిలో ప్రారంభించేందుకు చూస్తున్నారు. నానితో చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత చిరంజీవితో సినిమాను మొదలు పెట్టబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

చిరంజీవి మూడు సినిమాలు దేనికి అదే అన్నట్టుగా ఉండబోతున్నాయి. విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కమర్షియల్‌ మూవీ కాగా, అనిల్‌ రావిపూడి ద్శకత్వంలో చేయబోతున్న సినిమా పక్కా కామెడీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. ఇక శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కాస్త మాస్ అండ్ యాక్షన్ యాంగిల్‌ ఉండబోతుంది. మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి చాలా చాలా విభిన్నంగా సినిమాలు చేయబోతున్నారు. 2025లో మూడు సినిమాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉండనున్నారు. వచ్చే ఏడాదిలో మెగా ఫ్యాన్స్‌కి పండగే పండగ.

Tags:    

Similar News