ఫ్లాష్ బ్యాక్: అంజి సినిమాకు ఫస్ట్ ఆ హీరోను అనుకుంటే..

మెగాస్టార్ చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అంజి అప్పట్లో ఎంత హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

Update: 2024-01-25 04:37 GMT

మెగాస్టార్ చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అంజి అప్పట్లో ఎంత హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీని శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు. నిజానికి కంటెంట్ పరంగా చూసుకుంటే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథతో అంజి చిత్రం తెరకెక్కింది. మంచి కథ, కథనాలతో ఉన్న కూడా మూవీ ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేదు.

సినిమాలో గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి కూడా ఈ మూవీలో బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించాడు. నమ్రతా శిరోద్కర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యి సుదీర్ఘ కాలం షూటింగ్ జరుపుకొని రిలీజ్ కావడం మైనస్ అయ్యింది. అలాగే అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ కి అడ్వాన్స్ లెవల్ లో ఉండే గ్రాఫిక్స్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు.

కానీ ఈ రోజుల్లో అంజి మూవీ వచ్చి ఉంటే కచ్చితంగా ఊహించని కలెక్షన్స్ అందుకునే ప్రాజెక్ట్ అయ్యేదనే మాట వినిపిస్తోంది. కోడి రామకృష్ణ అద్భుతమైన చాలా అడ్వాన్స్ గ్రాఫిక్స్ తో ఆ రోజుల్లోనే అంజి మూవీ చేసి ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కథని కోడి రామకృష్ణ సిద్ధం చేసుకొని ముందుగా విక్టరీ వెంకటేష్ తో చేయాలని డిసైడ్ అయ్యారంట.

వెంకటేష్ కి కథ చెప్పడం, అతను ఒకే చెయ్యడం జరిగిపోయింది. అయితే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మెగాస్టార్ కి కలిసినపుడు ఈ అంజి మూవీ గురించి చెప్పి కథ కూడా నేరేట్ చేసారంట. చిరంజీవికి కథ బాగా నచ్చడంతో ఈ మూవీ నేను చేస్తానని శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెప్పారంట. దీంతో వెంకటేష్ తో అనుకున్న ఆ అంజి ప్రాజెక్ట్ కాస్తా చిరంజీవి చేతిలోకి వచ్చింది.

దీనికంటే ముందుగా కోడి రామకృష్ణ వెంకటేష్ దేవిపుత్రుడు మూవీ చేశారు. అది కూడా గ్రాఫిక్స్ ప్రధానంగా నడిచే కథగానే తెరకెక్కింది. ఈ సినిమాని అద్భుతమైన విజువల్ వండర్ గా కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. అయితే ఆశించి రిజల్ట్ రాలేదు. ఇది కూడా అంజి సినిమాలోని వెంకటేష్ ని కాకుండా చిరంజీవిని తీసుకోవడానికి ఒక కారణం అనే ప్రచారం అప్పట్లో నడిచింది.


Tags:    

Similar News