మెగాస్టార్‌ అరుదైన సర్టిఫికెట్‌ వైరల్‌

ఆ సర్టిఫికెట్‌ లో ఉన్న వివరాలు ఏంటి అంటూ క్షుణ్ణంగా తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు

Update: 2024-03-18 11:20 GMT

మెగాస్టార్ చిరంజీవి కి చెందిన చిన్న విషయం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా కూడా క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నిన్న మొన్నటి వరకు తాను నటిస్తున్న విశ్వంభర సినిమాతో వార్తల్లో నిలిచిన మెగాస్టార్‌ చిరంజీవి నేడు తన 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌ కారణంగా వార్తల్లో నిలిచారు. ఎలా బయటకు వచ్చిందో.. ఎప్పుడు బయటకు వచ్చిందో కానీ చిరంజీవి యొక్క 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ సర్టిఫికెట్‌ లో ఉన్న వివరాలు ఏంటి అంటూ క్షుణ్ణంగా తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సర్టిఫికెట్‌ లో చిరంజీవి పూర్తి పేరును కేఎస్‌ఎస్‌ వర ప్రసాద్‌ అని, తండ్రి పేరు వెంకట్‌ రావు అని ఉంది. అంతే కాకుండా చిరంజీవి పెనుగొండ లో పుట్టినట్లుగా కూడా అందులో పేర్కొన్నారు.

చిరంజీవి కి చెందిన ఈ సర్టిఫికెట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది ఏ సందర్భంలో తీసుకోవడం జరిగింది, ఎలా బయటకు వచ్చింది అనేది చిరంజీవి స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. ఈ విషయమై ఆయన స్పందించక పోవచ్చు. కనుక ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లుతున్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Tags:    

Similar News