హీరోయిన్ ఇంట పెళ్లిసందడి..!

కానీ ఆ సినిమాల్లో మేఘా తో ప్రేమలో పడిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.

Update: 2024-09-14 17:40 GMT

ఆడియన్స్ లో పాపులారిటీ సంపాదించినా సరే కొంతమంది హీరోయిన్స్ కు లక్ కలిసిరాదు. అందం అభినయం రెండు ఉన్నా కూడా ఎందుకో అంత ఫేమస్ అవ్వలేరు. అలాంటి కథానాయికల్లో ఒకరు చెన్నై భామ మేఘా ఆకాష్. తెలుగులో లై, ఛల్ మోహన్ రంగ సినిమాల్లో నటించిన అమ్మడు ఆ సినిమాలు హిట్ పడితే కెరీర్ ఎలా ఉండేదో కానీ అవి నిరాశ పరచడం వల్ల క్రేజ్ సంపాదించలేకపోయింది. కానీ ఆ సినిమాల్లో మేఘా తో ప్రేమలో పడిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.

ఐతే తెలుగులో వర్క్ అవుట్ కావట్లేదని తమిళ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది మేఘా ఆకాష్. ఐతే అక్కడ కూడా సెకండ్ లీడ్ ఛాన్స్ లు రావడంతో ఇక చేసేదేమి లేక సైలెంట్ అయ్యింది. ఈమధ్యనే అమ్మడు తన పెళ్లి వార్తతో అందరికీ షాక్ ఇచ్చింది. విష్ణు అనే వ్యక్తితో మేఘా ఆకాష్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతుంది. ఐతే అమ్మడు మెహిందీ డే చాలా గ్రాండ్ గా జరిగిందని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మెహిందీ డే చాలా గ్రాండ్ గా జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. అందాల భామకు పెళ్లై పోతుందే అనే భావన ఆమె ఫాలోవర్స్ కు ఉన్నా కొత్త జీవితం ఆమెకు పూర్తి సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్. పెళ్లి డేట్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే మేఘా ఆకాష్ ఇంట పెళ్లి సందడి మాత్రం కనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ మేఘా సినిమాలకు దూరం అవుతుందా లేదా కొనసాగిస్తుందా అసలు అమ్మడి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

హీరోయిన్ గా పెద్దగా క్లిక్ అవ్వలేదు కానీ మేఘా ఆకాష్ అంటే తెలుగు లో చాలా మంది ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న అమ్మాయిగానే అనిపిస్తుంది. ఐతే అమ్మడి పెళ్లి తర్వాత హీరోయిన్ గా చేసే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుందని కానీ పూర్తిగా సినిమాలకు దూరమైతే మాత్రం ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతారని చెప్పొచ్చు. మేఘా ఆకాష్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. మేఘా మ్యారేజ్ అప్డేట్స్ ను ఫోటోస్ రూపంలో అందిస్తూ అమ్మడు తన ఫాలోవర్స్ ని ఖుషి చేస్తుంది.

Tags:    

Similar News