బాక్సాఫీస్ రేస్.. టాప్ 4లో తండేల్
సినిమా విడుదలైన తొలిరోజు నుంచే సాలీడ్ రికార్డులు నెలకొల్పుతున్న తండేల్, రెండో వారం కూడా అదే ఊపును కొనసాగిస్తూ టిక్కెట్ కౌంటర్ల దగ్గర అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది.
సినిమా విడుదలైన తొలిరోజు నుంచే సాలీడ్ రికార్డులు నెలకొల్పుతున్న తండేల్, రెండో వారం కూడా అదే ఊపును కొనసాగిస్తూ టిక్కెట్ కౌంటర్ల దగ్గర అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది. నాగచైతన్య కెరీర్ లోనే ఇప్పటివరకు ఇదే హయ్యెస్ట్ నెంబర్. ఇక కొత్త సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా, పోటీని తట్టుకుని దూసుకుపోతోంది. మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను ఏ రేంజ్‌లో ఆదరిస్తున్నారో వసూళ్లు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం విశేషం. హనుమాన్ తర్వాత టాలీవుడ్ మిడ్ రేంజ్ సినిమాల్లో ఇలా స్టడీగా కలెక్షన్లు కొనసాగించిన సినిమా అరుదుగానే ఉంటుంది. తండేల్ మాత్రం రోజురోజుకూ మరింత స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. ముఖ్యంగా రెండో శనివారం మరింత ఊపందుకుని అన్ని చోట్లా మంచి కలెక్షన్లు రాబట్టింది.
ఇప్పటికే 9వ రోజు ఏకంగా 2.04 కోట్ల రేంజ్ షేర్ అందుకుని మరోసారి టాప్ 4 లిస్టులోకి ఎంటర్ అయింది. మొదటి వారంలో ఏదీ ఊహించని రీతిలో దూసుకెళ్లిన తండేల్, రెండో వారం మరింత స్టడీగా రన్ అవుతూ గట్టి హిట్‌గా నిలుస్తోంది. ఈ ఆదివారం మరింత బలంగా ఉండే అవకాశం ఉంది.
పెద్దగా హాలిడేస్ సీజన్ కానప్పటికీ, టాలీవుడ్ మిడ్ రేంజ్ సినిమాల్లో లాంగ్ రన్ కలెక్షన్లు మరింత హై చేయడంలో సక్సెస్ అవుతోంది. పోటీగా సినిమాల జోరు తగ్గిపోవడంతో తండేల్ మాస్ రాంపేజ్ మరికొన్ని రోజులు ఇలా కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి.
డే 9 టాప్ మిడ్ రేంజ్ మూవీస్ కలెక్షన్లు:
హనుమాన్ – 5.81Cr
కార్తికేయ 2 – 2.42Cr
బేబీ – 2.33Cr
తండేల్ – 2.04Cr
శ్యామ్ సింగ రాయ్ – 1.98Cr
టిల్లూ స్క్వేర్ – 1.89Cr
విరూపాక్ష – 1.84Cr
శతమానం భవతి – 1.78Cr
ఫిదా – 1.75Cr
ఉప్పెన – 1.49Cr
గీత గోవిందం – 1.45Cr
ప్రతి రోజూ పండగే – 1.40Cr
ఇక 10వ రోజైన ఆదివారం మరింత మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.