పుష్ప 2 స్టైల్ లో రానా సతీమణి.. స్టన్నింగ్!
తాజాగా స్పెషల్ పిక్ ను షేర్ చేశారు మిహీకా. అందులో వైట్ అండ్ వైట్ శారీలో కనిపించారు.;

టాలీవుడ్ హీరో రానా సతీమణి మిహీకా బజాజ్ గురించి అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీతో సంబంధం లేని ఆమె ఓ ప్రముఖ ఈవెంట్స్ మేనేజర్. కరోనా టైమ్ లో రానా, మిహీకా పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు ఇద్దరూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అయితే మిహీకా బజాజ్ దగ్గుబాటి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తుంటారు.

స్పెషల్ అప్డేట్స్ షేర్ చేసే మిహీకా.. సినీ ఇండస్ట్రీకి సంబంధం లేకపోవడంతో ఆ జోలికి వెళ్లరు. రానా మూవీలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వరు. ఫ్యామిలీ విషయాలు అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటారు. అందులో రానా గురించే ఎక్కువగా కనిపిస్తుంటాయి పోస్టులు. అవి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.
అదే సమయంలో తన గ్లామరస్ ప్రజెంటేషన్ తో హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంటారు మిహీకా. చిన్న గ్యాప్ తీసుకుని నెట్టింట స్పెషల్ ఫోటో షాట్స్ పోస్ట్ చేస్తుంటారు. మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో పిక్స్ తీసుకుని.. హీరోయిన్లకు మించిన అందంతో ఓ రేంజ్ లో నెటిజన్లను అలరిస్తుంటారు దగ్గుబాటి కోడలు.
తాజాగా స్పెషల్ పిక్ ను షేర్ చేశారు మిహీకా. అందులో వైట్ అండ్ వైట్ శారీలో కనిపించారు. స్పెషల్ ఏంటంటే ఆమె బ్లౌజ్ పై ఉన్న రెడ్ కలర్ హ్యాండ్ ప్రింట్ అందరినీ ఆకర్షిస్తోంది. ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. "హ్యాండ్ ప్రింట్? లిమిట్. ఎడిషన్. ఒకే రకమైనది. హృదయపూర్వకంగా రెడీ చేసినది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
అయితే మిహీకా.. పుష్ప రాజ్ స్టైల్ ఫాలో అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ ఔట్ ఫిట్స్ పై హ్యాండ్ ప్రింట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అప్పట్లో పుష్ప రాజ్ స్టైల్ షర్ట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో కూడా కనిపించాయి.
ఇప్పుడు అదే స్టైల్ ను మిహీకా ఫాలో అయ్యారని, క్రేజీగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. పుష్ప బ్రాండ్, పుష్ప గాడి ఫ్రెండ్ వైఫ్ అంటూ కామెంట్స్ సెక్షన్ నింపుతున్నారు. సో బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ మిహీకా మేడమ్ అంటూ పొగిడేస్తున్నారు. మొత్తానికి పుష్ప స్టైల్ ఫాలో అయ్యి ఒక్క పిక్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చారు మిహీకా.