రానా ఇంట 7G బృందావన్ కాలనీ సీన్!
రానా-మిహికా బజాజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిహీకా నార్త్ అమ్మాయి. పెద్దగా తెలుగు సంప్రదాయాలు తెలియదు
రానా-మిహికా బజాజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిహీకా నార్త్ అమ్మాయి. పెద్దగా తెలుగు సంప్రదాయాలు తెలియదు. కానీ తెలుగింట కోడలు కాబట్టి అన్ని పద్దతులు నేర్చుకుంటున్నారు. చిన్న నాటి నుంచి నార్త్ కల్చర్ అలవాటు పడిన మిహీకా అక్కడ సంప్రదాయాన్ని ఏమాత్రం మిస్ చేయరని తెలుస్తోంది. తాజాగా రానా ఇంట కర్వాచౌత్ పండుగ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఇది ప్రముఖంగా భర్త కోసం చేసే పండుగ. భర్త ఆయురారోగ్యాలు..యోగ క్షేమాల కోసం చేస్తారు. ఈ పండుగ రోజు ఆడమగా అంతా ఎంతో మనోహారంగా ముస్తాడువుతుంటారు. ముఖ్యంగా మహిళలు మహిళలు గోరింటాకు పెట్టుకొని, సాంప్రదాయంగా రెడీ అయి శివుడిని, చంద్రుడిని పూజిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ మంచి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఆకాశంలో చంద్రుడు వచ్చిన తర్వాత ముందుగా చందమామ ని చూసి ఆ తర్వాత జల్లెడలోనుంచి భర్త ముఖం చూస్తారు.
ఇలా అనగానే ఇక్కడో సినిమా సీన్ కనెక్ట్ అవుతుంది. అదే `7జీ బృందావన కాలనీ`లో నార్త్ బ్యూటీలంతా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో హీరోయిన్ సోనియా అగర్వాల్ అందులో హీరో అయిన రవికృష్ణ (రవి) ముఖాన్ని ఇలా అనుకోకుండా చూస్తుంది. అందులో చేసుకోవాల్సిన వాడు ఎదురుగా ఉన్నా? అనుకోకుండా రవిని చూస్తుంది. ఆ క్షణం ఆమె మనసులో కొత్త అభిప్రాయం ఏర్పడుతుంది.
భర్త ముఖం చూసాక భార్య ఉపవాసం విరమవిస్తుంటారు. ఈ పండుగ సందర్భంగా రానా భార్య మిహికా నార్త్ కల్చర్ ని గుర్తు చేసారు. ఆమె ఎంతో అందంగా ముస్తాబయ్యారు. ఓ పిక్ లో ఉత్తరాది అమ్మాయిలా ముస్తాబవ్వగా..మరోపిక్ లో తెలుగు సంప్రదాయం చీరలో తళుక్కున మెరిసారు. రానా దగ్గుబాటిని ట్యాగ్ చేసి హ్యాపీ కర్వాచౌత్ అని చెప్పారు.