టైసన్ (X) జేక్: భళ్లూక పోరాటం నెట్ ఫ్లిక్స్‌లో సంచలనం
ఆయనకు ధీటుగా ఫాలోయింగ్ ఉన్న బాక్సింగ్ ఆటగాడు జేక్ పాల్ తో పోరాడాల్సి ఉంటుందని తెలియగానే అభిమానుల్లో ఒకటే ఉద్వేగం ఉత్సాహం.
ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా సంచలనాలు సృష్టించిన మైక్ టైసన్ చాలా కాలానికి మళ్లీ రింగ్ లోకి దిగుతున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంత ఆసక్తిగా వేచి చూస్తారో ఊహించగలం. ఆయనకు ధీటుగా ఫాలోయింగ్ ఉన్న బాక్సింగ్ ఆటగాడు జేక్ పాల్ తో పోరాడాల్సి ఉంటుందని తెలియగానే అభిమానుల్లో ఒకటే ఉద్వేగం ఉత్సాహం.
అందుకే టైసన్ -జేక్ పాల్ మధ్య బాక్సింగ్ మ్యాచ్ స్ట్రీమింగులో రికార్డులు తిరగరాసింది. నెట్‌ఫ్లిక్స్ 6 కోట్ల (60 మిలియన్) గ్లోబల్ కుటుంబాలు.. 6.5 కోట్ల (65 మిలియన్) పీక్ స్ట్రీమ్‌లతో ట్యూన్ చేయడం ఒక సంచలనంగా మారింది. మహిళా బాక్సర్లు కేటీ టేలర్ - అమండా సెరానో కూడా పాల్గొన్న మ్యాచ్ 5 కోట్ల (50 మిలియన్ల) మంది వీక్షకులను ఆకర్షించింది. అమెరికాలో అత్యధికంగా వీక్షించిన ప్రొఫెషనల్ మహిళల క్రీడా ఈవెంట్‌గా నిలిచింది.
6వేల కంటే ఎక్కువ బార్‌లు, రెస్టారెంట్‌లలో ఈ మ్యాచ్ ని ప్రసారం చేసారు. ప్రకటనల ప్రచారంలో ఈ మ్యాచ్ వ్యూయర్ షిప్ దృష్ట్యా రికార్డు సృష్టించింది. టెక్సాస్‌లోని ఆర్లింగ్‌టన్‌లోని AT&T స్టేడియంలో జరిగిన ఈ పోరుకు 72,300 మంది హాజరు కాగా, వారిని ఆకర్షించి 18 మిలియన్ల డాలర్ల మేర గేట్ రశీదులను అధిగమించిందని సమాచారం.
ఈ క్రేజీ మ్యాచ్ కి సంబంధించి #PaulTyson హ్యాష్ ట్యాగ్ ద్వారా బోలెడంత ప్రచారం లభించింది. అయితే నెట్‌ఫ్లిక్స్ బఫరింగ్ సహా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ప్రసారంలో అంతరాయ లోపాలు సమస్యల్ని తెచ్చాయి. పాల్ - టైసన్ ఇద్దరూ ఎనిమిది అంకెలు సంపాదించారు. ఈ పోరాటాన్ని నెట్‌ఫ్లిక్స్ 283 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు ఉచితంగా ప్రసారం చేసింది.