మరో డైరెక్టర్ పై నటి లైంగిక ఆరోపణలు!
తాజాగా నటి మిను మునీల్ దర్శకుడు బాల చంద్ర మీనన్ పై లైంగిక ఆరోపణలు చేసింది
మలయాళం ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణల పర్వం కొనసాగుతోంది. హేమ కమిటీ నివేదికతో పోలీసులు ఎప్పటి కప్పుడు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోంటున్న వారందరిపై ఎటాకింగ్ కి దిగారు. తాజాగా నటి మిను మునీల్ దర్శకుడు బాల చంద్ర మీనన్ పై లైంగిక ఆరోపణలు చేసింది. ఫేస్ బుక్ వేదికగా తను పడ్డ ఇబ్బందులు చెప్పే ప్రయత్నం చేసింది.
2007లో డైరెక్టర్ తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేసాడు. కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలో ఉన్నారని తాను మాత్రం బయటకు వచ్చేసానని తెలిపింది. బాల చంద్ర తనని కూర్చోమని అడిగాడని వివరించింది. ప్రస్తుతం ఈ వ్యాఖలు సంచలనంగా మారాయి. ఇప్పటికే జయ సూర్య సహా ఏడుగురిపై ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి.
వాళ్లంతా విచారణకు రెడీ అవుతున్నారు. నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ నివేదికకు సంబం ధించిన వ్యవహారం కోర్టు ఫరిదిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత మహిళలంతా మీడియా ముందుకొచ్చి తమకెదురైన అనుభవాలు చెప్పుకుంటున్నారు. వాళ్లకు మద్దతుగా కొంత మంది నిలబడ్డారు.
అయితే స్టార్ హీరోలు ఎవరూ హేమ నివేదికపై స్పందించకపోవడం ఆశ్చర్య కరం. రజనీ కాంత్ ని అడిగితే నాకు తెలియదని సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా పలువుర్ని ప్రశ్నించినా వారంతా మాట దాటేసారు.