'మీర్జాపూర్ 4' హింస త‌గ్గేదెలా?

దీంతో మీర్జాపూర్ 4 అధికారిక ధృవీకరణ కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Update: 2024-07-10 01:30 GMT

ఓటీటీ లో మీర్జాపూర్ సిరీస్ మూడు సీజ‌న్లు గ్రాండ్ స‌క్సెస్ అయ్యాయి. మీర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవ‌లే స్ట్రీమింగ్ అయిన సంగ‌తి తెలిసిందే. అలీ ఫజల్ గుడ్డు భయ్యా- పంకజ్ త్రిపాఠి కలీన్ భయ్యా పాత్ర‌లు ఎప్ప‌టిలానే గొప్ప‌ ఇంటెన్సిటీతో అభిమానుల‌ను అల‌రించాయి. మునుపటి సీజన్‌ల వేగాన్ని కొనసాగించడంతో సీజ‌న్ 3కి కూడా మంచి స‌మీక్షలు వ‌చ్చాయి. మూడు సీజ‌న్లు ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు నాల్గవ సీజన్ కోసం నిరీక్షణ పెరిగింది. దీంతో మీర్జాపూర్ 4 అధికారిక ధృవీకరణ కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

న్యూస్ 18 వివ‌రాల ప్రకారం... షబ్నమ్ పాత్రలో నటించిన షెర్నావాజ్ సామ్ జిజినా సీజన్ 4 ప్రీప్రొడ‌క్ష‌న్ పురోగతిలో ఉందని, విడుదలకు ఎక్కువ కాలం ప‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. సూప‌ర్ గా తెర‌కెక్కుతోంది...నాలుగో సీజన్ ఉందని అందరికీ తెలుసునని స‌ద‌రు న‌టీమ‌ణి పేర్కొన్నారు. స్క్రిప్టు రచన కొనసాగుతోంది .. మేకర్స్ దానిపై పని చేస్తున్నారు. మేక‌ర్స్ మళ్ళీ చాలా షాక్ లు ఇచ్చే సీజ‌న్ తో తిరిగి వ‌స్తార‌ని భావిస్తున్నాన‌ని తెలిపింది. మూడు సీజ‌న్లు కుర్చీ అంచుపైకి జారి చూసేంత ఉత్కంఠ‌ను ఇచ్చాయ‌ని, సీజ‌న్ 4 కోసం న్యాయం చేసే కథాంశాన్ని రూపొందించడానికి రచయితలు అంకితభావంతో ఉన్నారని న‌టి షెర్నావాజ్ పేర్కొన్నారు. మేకర్స్ ఆలోచనలు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచే మరిన్ని అంశాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

బలమైన రాజకీయ కోణంతో కూడిన హౌస్ ఆఫ్ కార్డ్స్ శైలిని పోలి ఉండే ఈ సీజన్ మునుపటి వాటికి భిన్నంగా ఉందని కూడా ఆమె అన్నారు. మునుప‌టితో పోలిస్తే మరింత సూక్ష్మ ప‌రిశీల‌నా విధానంతో తీవ్రమైన హింసను సమతుల్యం చేయాల్సిన‌ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. త‌దుప‌రి సీజన్‌ను తెలివిగా రూపొందించినట్లు చెబుతున్నారు. వీక్షకులను మానసికంగా నిమగ్నమయ్యేలా ప్రేరేపిస్తుంద‌ని తెలిపారు.

మీర్జాపూర్ సీజన్ 3 గురించి

మీర్జాపూర్ సీజన్ 3 లో అభిమానులు ఆశించే డ్రామా, మసాలాకు కొద‌వేమీ లేదు. ఇందులో ఎక్క‌డా బలవంతంగా జొప్పించిన స‌న్నివేశాలేవీ క‌నిపించ‌వు..కథను సజావుగా కొనసాగిస్తాయి. ప్రధానతార‌ల‌ ప్రదర్శన, ర‌చ‌నా విభాగం ప్ర‌ధాన అస్సెట్స్. భవిష్యత్ సీజన్‌లపై భారీ అంచనాలను పెంచేలా ముగింపును సెట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఔత్సాహికులు తదుపరి ఏమి జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసేలా ఉంటుంది. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి స‌హా ఈ సిరీస్‌లో శ్వేతా త్రిపాఠి, ఇషా తల్వార్, విజయ్ వర్మ, రసిక దుగల్, రాజేష్ తైలాంగ్, అంజుమ్ శర్మ త‌దిత‌రులు న‌టించారు.

Tags:    

Similar News