హిందూత్వ ప్రచార చిత్రానికి జాతీయ సమైక్యత అవార్డు ఇస్తారా?
హిందుత్వ ప్రచారంతో ముడిపడి ఉన్న ఈ సినిమా కంటెంట్ కు జాతీయ సమైక్యతా సూత్రాలకు పొంతన లేదని ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.
69వ జాతీయ అవార్డుల్లో 'ది కాశ్మీర్ ఫైల్స్'కి జాతీయ సమక్యత సమగ్రత పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుపై వివాదం తలెత్తింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా మరికొందరు రాజకీయ నాయకులు 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం జాతీయ సమైక్యత అవార్డును అందుకోవడానికి అర్హత సాధించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
హిందుత్వ ప్రచారంతో ముడిపడి ఉన్న ఈ సినిమా కంటెంట్ కు జాతీయ సమైక్యతా సూత్రాలకు పొంతన లేదని ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రాన్ని గౌరవించాలనే నిర్ణయం వల్ల స్టాలిన్ సోషల్ మీడియాలో మాత్రమే ఒక ప్రకటన ద్వారా తన ఆశ్చర్యాన్ని తెలియజేశారు. రాజకీయ ఉద్దేశాలకు లొంగకుండా జాతీయ చలనచిత్ర అవార్డుల విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
చాలా మంది బహిష్కరించిన మతతత్వంతో కూడుకున్న వివాదాస్పద చిత్రానికి జాతీయ సమైక్యత అవార్డును ప్రదానం చేయడం గందరగోళం లాంటిదని ఆయన ఎత్తి చూపాడు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ అవార్డుపై వ్యంగ్యంగా స్పందించారు. జాతీయ సమైక్యత కోసం 'ది కాశ్మీర్ ఫైల్స్'ని ఎంపిక చేయడం అర్థంపర్థం లేనిదని వ్యంగ్యంగా స్పందించారు.
ది కాశ్మీర్ ఫైల్స్ మతతత్వాన్ని సూచించింది. ఇది హిందుత్వ భావజాలం ఉన్న హిందూ అనుచరుల నుండి మద్దతును పొందింది. కానీ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఈ సినిమా కథాంశం ఉందని సినీ విమర్శకులు విశ్లేషించారు. రాజకీయ నాయకులు సహా ముస్లిం సంస్థల నుండి ఈ చిత్రం విమర్శలను ఎదుర్కొంది. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా డాక్యు సినిమా కేటగిరీ అన్న విమర్శలు కూడా వచ్చాయి.