సుప్రీంకోర్టుకు మోహ‌న్ బాబు..బెయిల్ వ‌స్తుందా!

ఈ నేప‌థ్యంలో సుంప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వ‌స్తుంద‌ని మోహ‌న్ బాబు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Update: 2025-01-06 07:29 GMT

న‌టుడు, నిర్మాత‌ మోహ‌న్ బాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. జ‌ర్న‌లిస్ట్ పై దాడి కేసులో ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డానికి తెలంగాణ హైకోర్టు నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ మెహన్ బాబు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటీష‌న్ నేడు విచార‌ణ జ‌రుగుతుంది. త‌న వ‌య‌సు 78 ఏళ్లు అని, గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆ కార‌ణంగా ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని పిటీష‌న్ లో పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో సుంప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వ‌స్తుంద‌ని మోహ‌న్ బాబు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి మోహ‌న్ బాబుకి బెయిల్ వ‌స్తుందా? లేదా? అన్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోతుంది. ఓ ప్ర‌ముఖ న్యూస్ ఛానెల్ కి చెందిన జ‌ర్న‌లిస్ట్ పై మోహ‌న్ బాబు దాడి దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌మైందో తెలిసిందే. జ‌ర్న‌లిస్ట్ తెచ్చిన మైక్ నే అందుకుని అత‌డిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ జ‌ర్న‌లిస్ట్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

దీంతో హత్యాయత్నం ఆరోపణలపై మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మోహ‌న్ బాబు కోర్టు ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డారు. గత నెల డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే వాటిని మోహ‌న్ బాబు పాటించ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే మోహ‌న్ బాబుకు హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. కొన్ని రోజుల పాటు ఆయ‌న అజ్ఞాతంలోనూ ఉన్న‌ట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

అయితే దాడి అనంత‌రం మోహన్ బాబు స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ని ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. వైద్యం ఖ‌ర్చులు కూడా తానే భ‌రిస్తాన‌ని మాట ఇచ్చారు. ఈ దాడిని జ‌ర్న‌లిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్ర‌తీగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ కూడా చేసారు.

Tags:    

Similar News