నష్టపోయిన నన్ను పైకి లేపింది ఆయనే!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు- తిరుపతిలోని యూనివర్శిటీ 32వ యాన్యువల్ డే కార్యక్రమం నిన్నటి రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు- తిరుపతిలోని యూనివర్శిటీ 32వ యాన్యువల్ డే కార్యక్రమం నిన్నటి రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. రెండు కార్యక్రమాలు ఒకే రోజు రావడంతో వేదిక ఒకటైంది. దీంతో ఈ కార్యక్రమానికి మలయాళం స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ ని ఉద్దేశించి మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మోహన్ లాల్ `కన్నప్ప`లో నటిస్తున్నారు. ఇంకా పారితోషికం తీసుకోలేదు. అడిగితే ప్రస్తుతానికి వద్దు నటించి వెళ్తానని చెప్పారుట. అలాగే అగ్ర నటులతో విదేశాల్లో షూటింగ్ అంటే వాళ్లతో పాటు ఐదారుగురు అసిస్టెంట్లు కూడా ఉంటారు. వాళ్లని కూడా ప్లైట్ లో తీసుకెళ్లాలి. కానీ మోహన్ లాల్ గారు మాత్రం అంత మందికి బధులుగా ఒక్కర్నే తీసుకొస్తా అన్నారు. ఎందుకని అంటే నిర్మాత ఖర్చు పెరగకూడదు.
నా మ్యాకప్ నేనే వేసుకుంటానని షూటింగ్ కోసం ఒకే అసిస్టెంట్ తో వచ్చారు. అంత గొప్ప మనిషి మోహన్ లాల్. అలాగే ఇద్దరం చాలా కాలంగా మంచి మిత్రులం. కానీ ఇంతవరకూ కలిసి సినిమా చేయలేదు. అందు కే నేనే ఆయన్ని అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. కన్నప్పలో ఇద్దరం కలిసి నటిస్తున్నాం. కానీ కాంబినేషన్స్ సీన్స్ లేవు. అందుకే నీతో నటించే ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడుగుతున్నా.
నీ పక్కన ఓ విలన్ రోల్ ఇవ్వు..కానీ నన్ను కొట్టొద్దు. కావాలంటే గట్టిగా అరువు అన్నారు. దీనికి మోహన్ లాల్ బధులిస్తూ తప్పకుండా అన్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసాను. కానీ నిర్మాతగా సినిమాలు చేసి నష్ట పోయాను. అలాంటి సమయంలో మోహన్ లాల్ చేసిన ఓ సినిమాని తెలుగులో నేను అల్లుడు గారు గా రీమేక్ చేసి హిట్ కొట్టాను. మోహన్ లాల్ సినిమా వల్లే మళ్ళీ నేను కెరీర్ లో సక్సెస్ అయ్యాను` అని అన్నారు.