కన్నప్ప మెగా కిరాత
మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హిస్టారికల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాలో హీరో మంచు విష్ణు లీడ్ రోల్ పోషిస్తున్నారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో కన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తున్న మోహన్ బాబు.. కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఎందరో యాక్టర్స్ మూవీలో నటిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు.. కన్నప్పలో భాగమయ్యారు.
వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. అంతకుముందే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. శివుడికి ప్రీతికరమైన రోజు అయిన సోమవారం నాడే సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టుల క్యారెక్టర్ లను రివీల్ చేస్తూ.. పోస్టర్లను విడుదల చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇప్పటికే మోహన్ బాబు, మంచు విష్ణు సహా పలువురు యాక్టర్స్ ఫస్ట్ లుక్స్ ను మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ లుక్ ను రిలీజ్ చేశారు. కిరాత అనే పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు. పోస్టర్ పై పాశుపతాస్త్ర ప్రదాత- విజయుడిని గెలిచిన ఆటవిక కిరాత అంటూ రైటప్ ఇచ్చి అంచనాలు పెంచారు.
అయితే మోహన్ లాల్.. భీకరమైన గిరిజనుడిగా సినిమాలో కనిపించనున్నట్లు క్లియర్ గా ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. ఆయన రోల్ లో దైవత్వం, గొప్పతనం ఉంటాయని మేకర్స్ చెప్పగా.. క్యూరియాసిటీ పెరుగుతోంది. ప్రస్తుతం మోహన్ లాల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారగా.. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని ట్రెండ్ అవుతోంది.
ఇక సినిమాలో ప్రీతి ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. శరత్ కుమార్, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచు వారి మూడో తరం, విష్ణు పిల్లలు ఆరియానా, వివియానా, అవ్రామ్ కూడా యాక్ట్ చేస్తున్నారు. మరి వచ్చే ఏడాది రిలీజ్ కానున్న కన్నప్ప ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.