నాలుగేళ్ల తర్వాత సెట్స్ పైకి ఆ సినిమా!
కొన్నిసార్లు సక్సెస్ పుల్ కాంబినేషన్లు సైతం సెట్స్ కి వెళ్లడానికి ఆలస్యమవుతుంటుంది.
కొన్నిసార్లు సక్సెస్ పుల్ కాంబినేషన్లు సైతం సెట్స్ కి వెళ్లడానికి ఆలస్యమవుతుంటుంది. ఒక్కోసారి అది సంవత్సరాలు కూడా పట్టొచ్చు. 10-15 ఏళ్ల క్రితం రాసుకున్న కథలు..కాంబినేషన్లు కూడా ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. తాజాగా అలాంటి కాంబినేషన్ మరోటి తెరపైకి వచ్చింది. మలయాళం స్టార్ మోహన్ లాల్- జీతూజోసెప్ కాంబో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సక్సెస్ పుల్ చిత్రాలొచ్చాయి. గతేడాది కూడా `నెరు` సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు `రామ్` అనే సినిమా చేస్తున్నారు.
సక్సెస్ పుల్ కాంబో కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా సెట్స్ లో ఉంది. ఇదే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఇది రిలీజ్ కాక ముందే మరోసారి చేతులు కలపడానికి రెడీ అయింది. అయితే ఈప్రాజెక్ట్ ప్రకటించిన నాలుగేళ్ల తర్వాత ప్రారంభం అవ్వడం విశేషంగా చెప్పాలి. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అప్పట్లో ప్రారంభించలేదు. ప్రారంభోత్సవం జరిగింగి కానీ....టెక్నికల్ ఇష్యూస్ తో డిలే అయింది.
అయితే ఇకపై ఆ ఛాన్స్ లేదంటున్నారు. ఆగస్గులో షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మోహన్ లాల్ కూడా డేట్లు ఇచ్చేసినట్లు సమాచారం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రమని సమాచారం. ఇందులో రా ఏజెంట్ పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారుట. ప్రస్తుతం మోహన్ లాల్ రామ్ తో పాటు మరో మూడు సినిమాలు కూడా చేస్తున్నారు.
ఆయన ఏడాదికి నాలుగైదు సినిమాలతోనైనా ప్రేక్షకుల ముందుకొస్తుంటారు. మాలీవుడ్ లో మూడు షిప్ట్ లు పనిచేసే నటుడాయన. అందుకే ఏడాది మూడు నాలుగు రిలీజ్ లు తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. అవి గాక ఈ మధ్య తెలుగులోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాటితోనే ఇక్కడ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. ఇవి రెండు గాక ఇతర స్టార్ హీరోల చిత్రాల్లో తన రేంజ్ కి తగ్గ పాత్రలు వచ్చినా చేయడం ఆయన ప్రత్యేకత.