ఇలా ఫేమ‌స్ అయితే అది అల్టిమేట్!

కోల్ క‌త్తా జూనియ‌ర్ డాక్ట‌ర్ అత్యాచార ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-17 08:17 GMT

సినిమాల్లో అవ‌కాశాలు రావాల‌న్నా...బిగ్ బాస్ లో అవ‌కాశం రావాల‌న్నా? అంత‌క‌న్నా ముందు వారు నెట్టింట బాగా ఫేమ‌స్ అయి ఉండాలి? అనే రూల్ లా పనిచేస్తుంది. అందంతో పాటు ఓఐడెంటిటీ ఉంటే అవ‌కాశాల‌కు సులువైన మార్గం అది. కొంద‌రు అలా ఫేమ‌స్ స్థిర‌ప‌డ్డవారున్నారు. ప్ర‌త్యేకంగా ప‌నిగ‌ట్టుకుని ఫేమ‌స్ అవ్వాల‌ని ట్రై చేసి చేతులు కాల్చుకున్న వారు లేక‌పోలేదు.

ప్ర‌తిగా ట్రోలింగ్ కి గుర‌య్యారు. ఇటీవ‌లే శేఖ‌ర్ భాషా బిగ్ బాస్ లోకి వ‌చ్చాడంటే? దానికి కార‌ణం రాజ్ త‌రుణ -లావ‌ణ్య వ్య‌వ‌హారంలో వేలు పెట్ట‌డ‌మే. రాజ్ త‌రుణ్ వైపు ఓ స్నేహితుడిగా టీవీ డిబిట్ల‌ల‌లో పాల్గొని..లావ‌ణ్య చే చెంప దెబ్బ తినే స‌రికి బాగా ఫేమ‌స్ అయ్యాడు. అదే ఐడెంటిటీ బిగ్ బాస్ లో అవ‌కాశం తెచ్చి పెట్టింది. ఇదంతా ప‌క్క‌న‌బెడితే సోష‌ల్ కాజ్ తో ఫేమ‌స్ అవ్వడం అన్న‌ది అల్టిమేట్. అలాంటి ఘ‌న‌త మోక్షా సేన్ గుప్తా సాధించింది.

కోల్ క‌త్తా జూనియ‌ర్ డాక్ట‌ర్ అత్యాచార ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఆ ఘ‌ట‌న‌ని ఖండిస్తూ మోక్ష ఎంతో ఆవేశంగా చేసిన డాన్స్ వీడియో వైర‌ల్ అయింది. ఆందోళ‌న‌ల్లో భాగంగా ఒక ఎన్ జీవో ద‌క్షిణ కోల్ క‌త్తా వీధుల్లో ఈ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. వారితో పాటు న‌టి డాన్స‌ర్ మోక్ష గుప్తా డాన్సు చేసింది. ఇది అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఆమె హ‌వ‌భావాలు ఆక‌ట్టుకుం టున్నాయి. దీనిపై నెటి జ‌నులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

దీంతో ఆమె ఎవ‌రు అన్న వివ‌రాలు అంతా ఆరా తీస్తున్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా ప‌నిచేసింది. త‌ర్వాత న‌ట‌న‌వైపు అడుగులు వేసింది. కొన్ని సినిమాలు కూడా చేసింది. తెలుగు ఆడియ‌న్స్ కి అనువాద సీరియ‌ల్స్ తో మోక్ష సుప‌రిచిత‌మే. ఈ డాన్సు వీడియో గురించి మోక్ష స్పందించింది. ఈ ఘ‌ట‌న సమ‌యంలో హైద‌రాబాద్ లో ఉన్నా. విష‌యం తెలియ‌గానే సొంతూరుకి వ‌చ్చి నిర‌స‌న‌లో పాల్గొన్నా. ఓ క‌ళాకారిణిగా నిర‌స‌న‌లో భాగంగా వీధి ప్ర‌ద‌ర్శ‌న ఎంచుకున్నాను. అది ఇంత‌గా వైర‌ల్ అవుతుంద నుకోలేదు. బాధితురాలికి అండ‌గా నేను చేసిన ఓ చిన్న ప్ర‌య‌త్నం మాత్ర‌మే` ఇది అన్నారు.

Tags:    

Similar News