మోక్షజ్ఞ ఎంట్రీ డిలే...ఇప్పటికే తొమ్మిదేళ్లు వృద్ధా!
అన్ని అనుకున్నట్లు జరిగితే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే జరిగిపోవాలి. కానీ ఇంత వరకూ ఆ ఛాన్స్ లేకుండా పోయింది.
అన్ని అనుకున్నట్లు జరిగితే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే జరిగిపోవాలి. కానీ ఇంత వరకూ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తో మోక్షజ్ఞ లాంచ్ అవ్వాలి. డిసెంబర్ లో ముహూర్తం కూడా పెట్టారు. కానీ చివరి నిమిషంలో అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో మోక్షజ్జ ఎంట్రీపై రకరకరకాల కథనాలు అంతే ఆసక్తిని రేకెత్తించాయి. డెబ్యూ `కల్కి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల్లోకి వెళ్లిందని , మరికొంత మంది బాలయ్య `ఆదిత్య 999 మ్యాక్స్` తో తనయుడిని లాంచ్ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
`ఆదిత్య 999` స్టోరీ కూడా ఇప్పటికే బాలయ్య సిద్దం చేసి పెట్టారు. ఆ కథని తానే డైరెక్ట్ చేస్తానని కూడా ప్రకటించారు. మరి అదైనా జరుగుతుందా? అంటే అక్కడా క్లారిటీ లేదు. బాలయ్య వేర్వేరు సినిమాలతో బిజీ అవుతున్నారు తప్ప తనయుడి ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అటు నాగ్ అశ్విన్ నుంచి కూడా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఆయన కల్కి రెండవ భాగం పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు ప్రశాంత్ వర్మ అన్ని రెడీ చేసుకున్నా? అతన్ని హోల్డ్ లో పెట్టారు.
ఇలా మోక్షజ్ఞ ఎంట్రీపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మరి కొత్త ఏడాదిలోనైనా లాంచ్ చేస్తారా? అంటే దానిపైనా క్లారిటీ లేదు. దీంతో మోక్షజ్ఞ చిత్రంపై అసలేం జరుగుతుంది అన్నది అర్దం కాని పరిస్థితుల్లోకి దారి తీస్తుంది. మోక్షజ్ఞ మాత్రం ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సిద్దంగా ఉన్నాడు. చదువులు కూడా పూర్తి చేసాడు. ప్రస్తుతం అతడి వయసు 30 ఏళ్లు. అంటే ఎంట్రీ ఇప్పటికే బాగా ఆలస్యమైనట్లే లెక్క.
స్టార్ కిడ్స్ అంతా 21 లో నే లాంచ్ అయిపోతున్నారు. సక్సెస్ అయితే 30 ఏళ్లు వచ్చేసరికి తొమ్మిదేళ్ల కు సీనియర్ గా మారిపోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే మోక్షజ్ఞ చాలా ఎక్స్ పీరియన్స్ కోల్పోయినట్లే. 30 ఏళ్లకు లాంచ్ అయితే అతడికి స్టార్ డమ్ రావడానికి ఎలా లేదన్నా నాలుగైదేళ్లు పడుతుంది. అదీ చేసిన సినిమాలన్నీ వరుసగా సక్సెస్ అయితే ...ఫెయిలైతే పరిస్థితి అఖిల్ లా మారిపోతుంది.