మోక్షజ్ఞ డెబ్యూ.. ఫైనల్ గా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ వారసుడిగా తెరంగేట్రం చేస్తోన్న మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో.

Update: 2025-01-07 06:08 GMT

నందమూరి బాలకృష్ణ వారసుడిగా తెరంగేట్రం చేస్తోన్న మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో.ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. నిజానికి ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లోనే స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. అయితే కారణాలు ఏమనేది తెలియదు కానీ సడెన్ గా షూటింగ్ వాయిదా పడింది.

దీంతో మూవీ ఆగిపోయిందనే ప్రచారం నడిచింది. అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమా ఆగిపోలేదని, కొద్ది రోజులు వాయిదా పడిందని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మరల షూటింగ్ ప్రారంభోత్సవం గురించి క్లారిటీ ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ఇండస్ట్రీ సర్కిల్ లో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన న్యూస్ ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందని టాక్ నడుస్తోంది. త్వరలో దీనిపై మేకర్స్ కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ క్యాస్టింగ్ అండ్ క్రూ మొత్తాన్ని ప్రశాంత్ వర్మ ఫైనల్ చేశారని, షూటింగ్ ప్రారంభం రోజే వారు ఎవరనేది స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కూతురుని పరిచయం చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అయిన కూడా ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జెట్ తహా నిర్మించబోతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హీరో కథాంశంతో ఈ సినిమాని తెరపై విజువల్ స్పెక్టక్యులర్ గా ప్రశాంత్ వర్మ ఆవిష్కరించబోతున్నారంట. మోక్షజ్ఞ క్యారెక్టర్ కూడా ఈ చిత్రంలో చాలా విభిన్నంగా ఉండబోతోందని అనుకుంటున్నారు.

ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు లైన్ లో వెయిట్ చేస్తున్నారు. వారిలో వెంకీ అట్లూరి కూడా ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే వెంకీ అట్లూరి మోక్షజ్ఞతో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారంట. అలాగే బాలకృష్ణ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ ని బాలయ్య ఎవరి చేతిలో పెడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బాలయ్య ఈ సంక్రాంతికి జనవరి 12న ‘డాకు మహారాజ్’ సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీపైన పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.

Tags:    

Similar News