బాలయ్య వారసుడి ఫస్ట్-5 ఫిక్సైపోయాయా?
తప్పకుండా ఆ సినిమా ఉంటుంది? కానీ అది డెబ్యూ అవుతుందా? రెండవ సినిమా అవుతుందా? అన్నది ఆసక్తి కరంగా మారింది.
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ మొదటి ఐదు చిత్రాలు ముందే ఫిక్సై అయిపోయాయా? తనయుడిని బాలయ్య పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దించుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆప్రాజెక్ట్ డైలమాలో పడిందనే ప్రచారం సాగుతంది. తప్పకుండా ఆ సినిమా ఉంటుంది? కానీ అది డెబ్యూ అవుతుందా? రెండవ సినిమా అవుతుందా? అన్నది ఆసక్తి కరంగా మారింది.
ఎందుకంటే? మోక్షజ్ఞతో బాలయ్య అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడనే కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. 'కల్కి 2898' దర్శకుడు నాగ్ అశ్విన్ తో తనయుడిని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ నాగ్ అశ్విన్ తో మొదటి సినిమా కాకపోతే రెండవ సినిమా అయ్యే అవకాశం ఉంటుందిట. అలా ప్రశాంత్ వర్మ-నాగ్ అశ్విన్ మధ్య చిన్న గేమ్ నడుస్తోంది.
ఈ రెండు సినిమాల తర్వాత మరో యువ మేకర్ వెంకీ అట్లూరితో సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు వెలుగులోకి వస్తోంది. వెంకీ సక్సెస్ ట్రాక్ చూసి బాలయ్య ఇలా అతడిని కూడా తెరపైకి తెస్తున్నట్లు వినిపిస్తుంది. అలాగే 'ఆదిత్య 999'కి సీక్వెల్ ఉంటుందని కూడా చాలా కాలం క్రితం ప్రకటించారు. అందులో మోక్షజ్ఞ నటిస్తాడని కూడా ప్రచారంలో ఉంది.
ఇక బాలయ్యలో కొత్త యాంగిల్ ని తట్టి లేపిన బోయపాటి శ్రీనుతో తనయుడికి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టారు. మోక్షజ్ఞ ఓ మూడు సినిమాల తర్వాత బోయపాటితో సినిమా చేస్తే బాగుంటుందని ఇలా అతడిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా మోక్షజ్ఞ కోసం బాలయ్య మొదటి ఐదు సినిమాలు ముందుగానే సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది 2025లో ఏదో ఒక సినిమాతో మోక్షజ్ఞ బొమ్మ థియేటర్లో పడటం అయితే ఖాయం.