మోక్షజ్ఞ.. కసరత్తులు స్ట్రాంగ్ గానే..
కొద్ది సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై రకరకాల చర్చలు జరిగాయి.
నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎట్టకేలకు ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే తన మూవీ ఎంట్రీ కి అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అనేక రకాల వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏది నిజం కాలేదు. కొద్ది సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై రకరకాల చర్చలు జరిగాయి.
ఆ మధ్య మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై అసలు బాలయ్య వారసుడు హీరోగా సెట్ అవుతాడా? అనే వాదనలు సైతం వినిపించాయి. ఆ తర్వాత మోక్షజ్ఞ తన లుక్ చేంజ్ చేసుకొని ఫిట్ గా కనిపించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. బాలయ్య వారసత్వాన్ని కొనసాగించాలంటే మోక్షజ్ఞ ప్రతి ఒక్క అంశంలో ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గత నవంబర్ నుంచి వైజాగ్ లో సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ కి నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ లాంటి వారి దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకోవడం విశేషం. అంతేకాకుండా తన ఫిజిక్ పై కూడా దృష్టి సారిస్తూ బరువు తగ్గి సరికొత్త లుక్ లో కనపడేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.
మోక్షజ్ఞ ఓవైపు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూనే మరోపక్క తన శరీర దృఢత్వాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. లుక్స్, ఫిజిక్ విషయంలోనూ ది బెస్ట్ అనిపించుకునేలా ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి 'ఆదిత్య 369' సిక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలో చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ బాలయ్య వారసుడిని పరిచయం చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అందులోనూ ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. ఇక ఎట్టకేలకు తన డెబ్యూ మూవీ కోసం ఓ వైపు నటనలో శిక్షణ తీసుకుంటూనే ఫిట్ నెస్ పై దృష్టి పెట్టడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు మోక్షు మూవీ ఎంట్రీ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎవరితో ఉంటుందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.