మోక్షు బాబు.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

అక్టోబర్ నెలలో మోక్షు ఫస్ట్ మూవీ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించేందుకు బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2024-09-08 14:30 GMT

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ.. డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ రీసెంట్ గా వచ్చిన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మోక్షును సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయనున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను కూడా బర్త్ డే సందర్భంగా ఆయన విడుదల చేశారు. అందులో స్టైలిష్ గా, కిర్రాక్ కా మోక్షు కనిపించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోని రెండో చిత్రంగా రానున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీని బాలయ్య రెండో కూతురు తేజస్విని నిర్మిస్తోంది. నటసింహం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటైన లెజెండ్ పేరుతో స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ బ్యానర్ పై సమర్పిస్తోంది. సోషల్ ఫాంటసీ జోనర్ లో విజువల్ వండర్ గా మోక్షు, ప్రశాంత్ వర్మ సినిమా ఉండనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గాండీవ అనే టైటిల్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పూజా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ వర్మ.. కేవలం ఒక్క పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేశారు. టైటిల్ సహా క్యాస్టింగ్ కు సంబంధించి ఎలాంటి వివరాలను అనౌన్స్ చేయలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి మూవీ లాంఛింగ్ ఎప్పుడు జరుగుతుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. బాలయ్య అందుకు భారీ ప్లాన్ వేసేశారని చెబుతున్నారు.

అక్టోబర్ నెలలో మోక్షు ఫస్ట్ మూవీ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించేందుకు బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంచి ముహుర్తంలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని సమాచారం. టాలీవుడ్ కు చెందిన అనేక మంది సెలబ్రిటీలను ఇన్వైట్ చేస్తున్నట్లు వినికిడి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు అభిమానులను కూడా పిలవనున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్త్తుండడం వల్ల వాళ్లను కూడా పిలవనున్నారట.

ఫస్ట్ రోజు నుంచే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యేందుకు బాలయ్య.. తన టాలెంట్ తో లాంఛింగ్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ను మేకర్స్ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మోక్షు డెబ్యూ మూవీ.. థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం. మొత్తానికి మోక్షు ఫస్ట్ సినిమా లాంఛింగ్ ఈవెంట్.. నెవ్వర్ బిఫోర్ అన్న విధంగా జరగనుందని సినీ ఇండస్ట్రీలో టాక్.

Tags:    

Similar News