ఆ నలుగురి వేధింపులతో చెన్నై వెళ్లి పోయాను

కేరళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2024-08-26 07:29 GMT

కేరళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు కమిటీ సభ్యులు వర్క్‌ చేసి, ఎంతో మందితో మాట్లాడిన తర్వాత రూపొందించిన ఈ రిపోర్ట్‌ తో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త అమ్మాయిలు నుంచి మొదలుకుని పెద్ద హీరోయిన్స్ వరకు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ పరిస్థితి కొనసాగుతోందని హేమ కమిటీ రిపోర్ట్‌ లో ఉంది. ఈ రిపోర్ట్‌ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఈ సమయంలో కొందరు హీరోయిన్స్, సీనియర్‌ నటీమనులు మీడియా ముందుకు వచ్చి గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. సీనియర్ నటి మిను తాజాగా సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ మలయాళ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలు అయిన ముఖేష్‌, మణియన్ పిళ్ల, ఇడవేల బాబు, జయసూర్య లతో పాటు ప్రొడక్షన్ కంట్రోలర్ నోబల్, విచు లు నన్ను వేధించారు. వారి వేధింపులు భరించలేక నేను కేరళ నుంచి చెన్నై వెళ్లవలసి వచ్చిందని మిను చెప్పుకొచ్చింది.

2013 లో ఒక సినిమా కోసం వర్క్‌ చేస్తున్న సమయంలో వారు నన్ను అసభ్య పదజాలంతో తిడుతూ, నన్ను పదే పదే దూషించారు. అన్నింటిని తట్టుకుని నేను ఈ సినిమా పూర్తి చేయాలని అనుకున్నాను. వారి వేధింపులు ఒకానొక సమయంలో శృతిమించాయి. అప్పట్లోనే నేను స్థానిక మీడియా సంస్థలతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. కానీ అప్పట్లో ఈ విషయాన్ని గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోలేదు. అందుకే నేను కేరళ నుంచి చెన్నై కి వెళ్లి పోవాల్సి వచ్చిందని మిను ఆవేదనతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

మిను తో పాటు ఇంకా చాలా మంది కూడా సోషల్ మీడియా ద్వారా తాము గతంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ ఇబ్బందులను గురించి కూడా పలువురు చెబుతూ ఉంటే అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి పలువురు సీనియర్‌ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు ఎదుర్కొన్న వారు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి అంటూ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అన్నారు.

Tags:    

Similar News