వివాదాస్పద నటి రీ ఎంట్రీ ప్రయత్నాలు
మోనికా బేడీ అవకాశాలు వస్తే మరోసారి తన నటన ప్రతిభను చూపించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
హిందీ, తెలుగు సినీ ప్రేక్షకులకు మోనికా బేడీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కడ ఇక్కడ చాలా సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా వివాదాస్పద విషయాల కారణంగా వార్తలో కూడా ఎక్కువగా కనిపించిన ఈ నటి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
గతంలో గ్యాంగ్ స్టర్ అబు సలేం భార్య అంటూ ముద్ర పడటం మాత్రమే కాకుండా ఏవో కారణాల వల్ల జైలుకు వెళ్లడం వల్ల ఈమె గురించి సినిమా ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో చెడ్డ అభిప్రాయం ఏర్పడింది. దాంతో ఈమెను సినిమాల్లోకి తీసుకునేందుకు ఏ ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా ఈమె ను సినిమాల్లో చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకోవడం లేదు.
ఇన్నాళ్లు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్న మోనికా బేడీ అవకాశాలు వస్తే మరోసారి తన నటన ప్రతిభను చూపించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఈ వయసులో కూడా అందాల ఆరబోత చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఈమె ఉందని తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన తీరును చూస్తే అనిపిస్తుందని మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె గతం.. వివాదాల కారణంగా ఇప్పటికి కూడా ఏ ఒక్కరు ఆమెకు ఆఫర్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. సినిమాలు కాదు కదా కనీసం సిరీస్ ల్లో కూడా ఆమెను నటింపజేసేందుకు గాను ఏ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు. చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఏదో ఒక సినిమా ఆఫర్ కోసం ఆమె ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఎప్పటికి ఆఫర్ ఆమె తలుపు తడుతుందో చూడాలి.
తెలుగు లో ఈమె చేసిన తాజ్ మహల్ సినిమా ఎప్పటికి కూడా పాపులర్ సినిమాగా నిలుస్తుంది. బిగ్ బాస్ తో పాటు పలు బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపించినా కూడా వెండి తెరపై కనిపించేందుకు అవకాశాలు రావడం లేదు. ముందు ముందు అయినా ఈమె కోరుకున్నట్లుగా రీ ఎంట్రీకి ఛాన్స్ దక్కేనా చూడాలి.